PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ సీఏజీఆర్ వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 50శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ఇండియా( పీడబ్ల్యూసీ) నివేదిక పేర్కొంది.
'ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ - 2022-27' పేరుతో పీడబ్ల్యుసీ తన నివేదికను విడుదల చేసింది.
2026-27 నాటికి యూపీఐ లావాదేవీలు రోజుకు రూ.100కోట్లకు చేరుకునే అవకాశం ఉందని, ఇది దేశంలోని రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90శాతం వాటాను కలిగి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక చెప్పింది.
డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని నడిపిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) 2022-23లో రిటైల్ విభాగంలో మొత్తం లావాదేవీల పరిమాణంలో 75 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. .
చెల్లింపులు
యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డులతో ఎక్కువ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపులు 2022-23లో 103 బిలియన్ల కాగా, 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 411 బిలియన్ల లావాదేవీలను చేరుకోవచ్చని నివేదిక పేర్కొంది.
2022-23లో రోజుకు 83.71 బిలియన్ లావాదేవీలు జరగ్గా, 2026-27 నాటికి 379 బిలియన్ లావాదేవీలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
యూపీఐ తర్వాత రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఎక్కువగా ఉపయోగించే సాధనాల్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటాయని నివేదిక చెప్పింది.
అయితే డెబిట్ కార్డు కంటే, క్రెడిట్ కార్డ్ ఆరోగ్యకరమైన రేటుతో వృద్ధి చెందుతందని వివరించింది.
2024-2025 నాటికి క్రెడిట్ కార్ట్స్ లావాదేవీల పరిమాణం డెబిట్ కార్డ్‌లను అధిగమిస్తుందని భావిస్తున్నారు.