Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. వరుసగా తగ్గుతున్న పసిడి.. మరింత తగ్గే ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఏడాది చివర్లో తగ్గుముఖం పట్టాయి. గత రెండు, మూడు రోజులుగా వరుసగా క్షీణిస్తున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080కి చేరింది.
వివరాలు
హైదరాబాద్‌లో తులం బంగారంపై రూ.480 తగ్గుదల
తాజా హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,080గా ఉంది.
శుక్రవారం ఈ ధర రూ.1,25,560గా నమోదైంది. అంటే ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ.480 తగ్గింది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650 వద్ద ట్రేడవుతోంది.
సాధారణంగా ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది.
వివరాలు
ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు
హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080గా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రూ.1,25,230 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీ మినహా కేరళ, బెంగళూరు, పూణె వంటి ప్రధాన నగరాల్లోనూ హైదరాబాద్ తరహా ధరలే కొనసాగుతున్నాయి.
వివరాలు
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాల ప్రభావం
బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.
దీంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గి ధరలపై ఒత్తిడి పెరగవచ్చు.
వివరాలు
మరింత తగ్గుతాయా?
అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలతో పాటు డాలర్ బలపడటం కూడా బంగారం ధరల పతనానికి కారణమవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నప్పటికీ, అది పూర్తిగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
అందువల్ల బంగారం కొనాలనుకునేవారికి ప్రస్తుత ధరలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
అయితే ధరలు మరింత తగ్గుతాయా లేదా అన్నది ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.