Aadit Palicha: క్విక్ కామర్స్‌లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్‌ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రోజువారీ ఆర్డర్ల సంఖ్యలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రత్యేకంగా కేఫ్ ఆఫరింగ్స్ కోసం ప్రవేశపెట్టిన 'జెప్టో కేఫ్' సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.
తాజాగా ఈ విభాగం నుంచి వచ్చే రోజువారీ ఆర్డర్లు లక్ష మైలురాయిని దాటి మరింత వృద్ధిని సాధించాయి.
ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అదిత్ పలిచా స్వయంగా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
'జెప్టో కేఫ్' లక్ష ఆర్డర్ల మైలురాయి
'జెప్టో కేఫ్ రోజువారీ లక్ష ఆర్డర్ల మార్క్‌ను అధిగమించిందని. ఇది సాధారణ విషయం కాదన్నారు.
దేశీయ క్విక్ కామర్స్ విభాగంలో ఇది ఓ విప్లవానికి నాంది అవుతుందని అదిత్ పలిచా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Details
క్విక్ కామర్స్ రంగంలో పెరుగుతున్న పోటీ
ఇప్పటికే బ్లింకిట్ 'బిస్ట్రో', స్విగ్గీ 'బోల్ట్' లాంటి సేవలు 10 నిమిషాల్లో ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించేందుకు పోటీ పడుతున్నాయి.
తాజాగా, బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'స్విష్' కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టింది.
పలు నగరాల్లో స్నాక్స్, పానీయాలు, భోజనంతో పాటు ఇతర వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ చేయడమే కాకుండా క్లౌడ్ కిచెన్ సేవలు కూడా అందిస్తోంది.
Details
జెప్టో కేఫ్ ఏమిటి?
జెప్టో కేఫ్ దేశంలోని ప్రధాన నగరాల్లో కాఫీ, టీ, పేస్ట్రీలు, స్నాక్స్, పానీయాలు వంటి 148 రకాల ఫుడ్ ఆప్షన్లు అందించే ప్రత్యేకమైన సేవ. కేవలం 10 నిమిషాల్లో ఈ ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడం దీని ప్రత్యేకత.
వినియోగదారుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో, ఈ సేవలను మరింత విస్తరించాలని జెప్టో యోచిస్తోంది.
భవిష్యత్తులో IPO ప్లాన్స్
వృద్ధి బాటలో దూసుకుపోతున్న జెప్టో , వచ్చే ఏడాదిలో IPOకి రావడానికి సన్నాహాలు జెప్టో భవిష్యత్తులో మరింతగా దూసుకుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి