LOADING...
UPI: యూపీఐలో చెల్లింపులో నూతన విప్లవం.. పిన్ లేకుండా ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌తో సులభ లావాదేవీలు
యూపీఐలో చెల్లింపులో నూతన విప్లవం.. పిన్ లేకుండా ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌తో సులభ లావాదేవీలు

UPI: యూపీఐలో చెల్లింపులో నూతన విప్లవం.. పిన్ లేకుండా ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ రికగ్నిషన్‌తో సులభ లావాదేవీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ (UPI) చెల్లింపుల రంగంలో మరో పెద్ద మార్పు రాబోతోంది. పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండా, ఫేస్‌ రికగ్నిషన్ లేదా ఫింగర్‌ప్రింట్‌ సాయంతో లావాదేవీలు చేయగలిగే సదుపాయం త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త వ్యవస్థను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) అక్టోబర్‌ 8న ముంబైలో జరుగుతున్న ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ఆవిష్కరించనుందని 'రాయిటర్స్‌' పేర్కొంది.

Details

బయోమెట్రిక్ విధానంతో చెల్లింపులు

రీసర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సూచన మేరకు, UPI చెల్లింపులలో 4/6 అంకెల పిన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండేలా వ్యవస్థ రూపొందించడం NPCI దృష్టిలో ఉంది. ఈ కొత్త విధానం ద్వారా ఉపయోగకర్తలు ఆధార్‌ డేటాబేస్‌లో ఉన్న బయోమెట్రిక్‌ వివరాలను వినియోగించి పేమెంట్స్‌ చేయవచ్చు. NPCI అధికారికంగా ఇంకా ప్రకటన చేయకపోయినా, ఒకసారి బయోమెట్రిక్‌ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమైతే, డిజిటల్‌ పేమెంట్స్‌ లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పిన్‌ ఆధారిత సౌకర్యం తగ్గడంతో, లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా, సౌకర్యవంతంగా మారుతాయి.