Loading...
Reliance Jio : జియో యూజర్లకు షాక్‌.. ప్రీపెయిడ్‌ ప్లాన్ల నుంచి గూగుల్‌ ఏఐ ప్రో తొలగింపు!
జియో యూజర్లకు షాక్‌.. ప్రీపెయిడ్‌ ప్లాన్ల నుంచి గూగుల్‌ ఏఐ ప్రో తొలగింపు!

Reliance Jio : జియో యూజర్లకు షాక్‌.. ప్రీపెయిడ్‌ ప్లాన్ల నుంచి గూగుల్‌ ఏఐ ప్రో తొలగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లలో అందిస్తున్న గూగుల్‌ ఏఐ ప్రో (Google AI Pro) సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ను తొలగించింది. అయితే ఈ మార్పు కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తించనుంది. ఇప్పటికే ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ద్వారా గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ పొందుతున్న వారికి మాత్రం ఈ ప్రయోజనం కొనసాగుతుంది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

వివరాలు

కొత్త యూజర్లకు కాన్వా సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే

రూ.35,100 విలువైన గూగుల్‌ ఏఐ ప్రో ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్‌ ప్లాన్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా అందిస్తోంది.

అయితే ఇకపై కొత్తగా రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులకు గూగుల్‌ ఏఐ ప్రోకు బదులుగా కాన్వా సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే లభిస్తుంది.

ఎంపిక చేసిన రీఛార్జ్‌ ప్లాన్లపై కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్‌ ప్రయోజనాలను పొందొచ్చు.

వివరాలు

రూ.399 ప్లాన్‌తో కాన్వా ప్రో ఉచితం

రూ.399 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌పై రూ.4 వేల విలువైన కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.

దీనితో పాటు జియో హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, మొబైల్‌ ద్వారా జియో గేమ్స్‌ వీక్షించే సదుపాయం కూడా ఉంది.

రూ.349 ప్లాన్‌పై కాన్వా ప్రో లైట్‌

రూ.349 ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా పొందొచ్చు.

అదనంగా జియో హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ ప్రయోజనాలు లభిస్తాయి.

ఇప్పటికే ఈ రీఛార్జ్‌ ప్లాన్లను క్లెయిమ్‌ చేసుకున్న వినియోగదారులకు గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ యథావిధిగా కొనసాగుతుందని జియో స్పష్టం చేసింది.

ADVERTISEMENT