LOADING...
UAE: గల్ఫ్‌లో శాంతి సంకేతాలు.. చమురు లోడింగ్‌కు యూఏఈ కీలక ప్రకటన
గల్ఫ్‌లో శాంతి సంకేతాలు.. చమురు లోడింగ్‌కు యూఏఈ కీలక ప్రకటన

UAE: గల్ఫ్‌లో శాంతి సంకేతాలు.. చమురు లోడింగ్‌కు యూఏఈ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి మళ్లీ సాధారణ రవాణాకు అందుబాటులోకి రావడంతో అరబ్‌ దేశాలు చమురు ఎగుమతులను పునఃప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన అబుదాబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ADNOC) తన కొనుగోలుదారులకు కీలక సూచనలు జారీ చేసింది. పర్షియన్‌ గల్ఫ్‌లోని తమ ఓడరేవుల నుంచి ముడి చమురు లోడింగ్‌ను తిరిగి ప్రారంభించాలని కోరింది. యూఏఈ తెలిపిన వివరాల ప్రకారం.. పర్షియన్‌ గల్ఫ్‌లోని దాస్‌,జిర్కు దీవుల్లో ఉన్న తమ పోర్టుల్లో ఏప్రిల్‌ 27 నుంచి లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు 

భారత్‌కు చమురు సరఫరా చేసే ప్రధాన దేశాల్లో యూఏఈ ఒకటి 

అమెరికా-ఇరాన్‌ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి మీదుగా ఎలాంటి అంతరాయం లేకుండా చమురు రవాణా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కొనుగోలుదారులు తమ సొంత ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో..తమ అనుబంధ నౌకల ద్వారా రవాణా సదుపాయం కల్పిస్తామని కూడా యూఏఈ వెల్లడించింది. దీంతో చమురు సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. భారత్‌కు చమురు సరఫరా చేసే ప్రధాన దేశాల్లో రష్యాతో పాటు యూఏఈ కూడా కీలక స్థానంలో ఉంది. మే నెలలో యూఏఈ నుంచి సగటున రోజుకు 6.2లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. ఇటీవలి ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒపెక్‌ కూటమి నుంచి వైదొలిగిన యూఏఈ..చమురు ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

వివరాలు 

గుజరాత్‌కు చేరిన ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్

ఈ నిర్ణయం భారత్‌ వంటి భారీ ఇంధన దిగుమతి దేశాలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు గల్ఫ్‌ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయనడానికి మరో సంకేతంగా మూడు నెలలకు పైగా నిరీక్షణలో ఉన్న 'దిశా' ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్‌ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. 62,370 మెట్రిక్‌ టన్నుల ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)తో ప్రయాణించిన ఈ నౌక శుక్రవారం గుజరాత్‌లోని దహేజ్‌ పోర్టుకు చేరుకుంది. ఖతార్‌లోని రాస్‌లఫాన్‌ పోర్టులో ఎల్‌ఎన్‌జీని లోడ్‌ చేసుకున్న ఈ ట్యాంకర్‌.. గల్ఫ్‌ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మూడు నెలలకు పైగా అక్కడే నిలిచిపోయింది.

Advertisement

వివరాలు 

భారత్‌కు ఇవి అనుకూల పరిణామాలు

అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై ఇరు దేశాలు సంతకాలు చేసిన అనంతరం భారత్‌కు చేరుకున్న తొలి ఎల్‌ఎన్‌జీ నౌక ఇదే కావడం విశేషం. హర్మూజ్‌ జలసంధి తిరిగి సాధారణ రవాణాకు అందుబాటులోకి రావడం, యూఏఈ చమురు లోడింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం, ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు భారత్‌కు చేరుకోవడం వంటి పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరటనిచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా చమురు, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు ఇవి అనుకూల పరిణామాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement