LOADING...
ACC: 2040 నాటికి 700 గిగావాట్లకు ఏసీసీ బ్యాటరీల డిమాండ్
2040 నాటికి 700 గిగావాట్లకు ఏసీసీ బ్యాటరీల డిమాండ్

ACC: 2040 నాటికి 700 గిగావాట్లకు ఏసీసీ బ్యాటరీల డిమాండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీల అవసరం 2040 నాటికి 700 గిగావాట్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఈ డిమాండ్ కేవలం 28 జీడబ్ల్యూహెచ్ మాత్రమేనని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయెన్స్ (IESA) వెల్లడించింది. ఈ వివరాలను ఐఈఎస్ఏ గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఇండియా బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ & సప్లై చైన్ సమ్మిట్ (IBMSSCS) సందర్భంగా ఈ నివేదికను ఆవిష్కరించారు. నివేదిక ప్రకారం 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించాలంటే భారత్ తన వాతావరణ మార్పు సంబంధిత కట్టుబాట్లను నెరవేర్చడం అత్యంత కీలకం.

Details

పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ సిద్ధం

ఇందుకోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగంగా మారడం, అలాగే భారీ స్థాయిలో ఎనర్జీ స్టోరేజ్ సదుపాయాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేష్ కుల్హరి మాట్లాడుతూ, బ్యాటరీ తయారీ, స్టోరేజ్ రంగాల్లో పెద్ద ఎత్తున సహకార భాగస్వామ్యాలు (పార్ట్‌నర్‌షిప్స్) ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం బ్యాటరీ తయారీదారులు, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనుకూలమైన విధానాలు, ప్రోత్సాహక వ్యవస్థను రూపొందించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ ఐటీఈసీ డైరెక్టర్ ఎస్‌కే శర్మ తెలిపారు. ఈశిఖరాగ్ర సదస్సులో చైనా, జపాన్, కొరియా, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థలోని అవకాశాలు, సవాళ్లపై చర్చించారు.

Advertisement