Adani group: అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం 51శాతం క్షీణత
అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 51శాతం మేర క్షీణించి, రూ.227.82 కోట్లకు చేరుకుంది. కోల్ ట్రైడింగ్ డివిజన్ పనితీరు నెమ్మదించడంతో లాభంలో కోత పడింది. ముఖ్యంగా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 41శాతం క్షీణించడం గమనార్హం. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.38,175.23 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.22,517.3 కోట్లకు తగ్గినట్లు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.
అదాన్ 8 పవర్ ప్లాంట్లు
మరోవైపు అదానీ గ్రూప్‌నకు చెందిన విద్యుదుత్పత్తి సంస్థ క్యూ2లో రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్‌లో ముగిసిన త్రైమాసికంలో రూ.6,594 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించిది. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు 9 రెట్లు పెరగడం విశేషం. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.696 కోట్లుగా ఉంది. అదానీ పవర్‌కు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో మొత్తం 8 పవర్ ప్లాంట్లు ఉన్నాయి.