Page Loader
అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు
అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు

అదానీ గ్రూప్‌లో గతంలో కంటే ఎక్కువ మంది రుణదాతలు

వ్రాసిన వారు Stalin
Apr 28, 2023
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదక తర్వాత గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ పరిస్థితి దారుణంగా తయారైంది. అదానీ గ్రూప్ షేర్ల విలువ అమాంతం పడిపోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన మూడు నెలల తర్వాత కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? రుణదాతలు పెరిగారా? తగ్గారా? ఒసారి పరిశీలిద్దాం. మార్చి 31 నాటికి అదానీ గ్రూప్ రుణం రూ. 2.27 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం రుణంలో, 39శాతం బాండ్లలో ఉంది. 29శాతం ప్రపంచ బ్యాంకుల్లో ఉంది. మిగిలిన 32శాతం పీఎస్‌యూలు, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా నిధులు సమకూర్చుకుంది. మార్చి నాటికి అదానీ గ్రూప్ సుమారు 3 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించింది.

అదానీ గ్రూప్

18నుంచి 25కు పెరిగిన రుణదాతల సంఖ్య 

హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, చాలా మంది పెట్టుబడిదారులు అదానీ స్టాక్‌లను విక్రయించారు. అయితే ఆ ప్రభావం సంస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆదానీ గ్రూప్ రుణదాతల సంఖ్య 18 నుంచి 25కి పెరిగింది. రుణదాతల జాబితాలో రెండు అమెరికన్ బ్యాంకులు, మూడు యూరోపియన్ బ్యాంకులు, మూడు జపనీస్ కంపెనీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, కొత్త గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల కోసం అదానీ గ్రూప్ మరో 800మిలియన్ డాలర్లు సేకరించేందుకు చర్చలు జరుపుతోంది. అదానీ గ్రూప్ నిధుల సమీకరణ కోసం సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, డీబీఎస్ బ్యాంక్ లిమిటెడ్, మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్, స్టాండర్డ్ చార్టర్డ్‌తో సహా ప్రపంచ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.