Page Loader
రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్
రుణాలని చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ

రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 06, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువలో సగానికి పైగా నష్టపోయింది. ఆ నష్ట నివారణ చర్యల దిశగా అదానీ గ్రూప్ పనిచేస్తుంది. మల్టీ-ప్రోంగ్ విధానం ద్వారా పెట్టుబడిదారుల ఆందోళనలకు జవాబు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇందులో షేర్లపై రుణాలను ముందస్తుగా చెల్లించడం (LAS), మూలధన వ్యయాన్ని తగ్గించడం వంటివి ఉంటాయి. ఇన్వెస్టర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, రుణదాతలు, నియంత్రణ సంస్థలు అన్నీ ఇప్పుడు ఈ సంస్థను నమ్మే పరిస్థితిలో లేవు. పెట్టుబడిదారుల ఆందోళనలను తగ్గించడానికి గ్రూప్ అదనపు షేర్ సెక్యూరిటీలను అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. రూ. 20,000 కోట్ల అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO రద్దు చేసిన తర్వాత తన మూలధన వ్యయంపై నియంత్రణ విధించాలని నిర్ణయించింది.

అదానీ

అదానీ గ్రూప్ తన LASని సున్నాకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది

అదానీ గ్రూప్ తన రూ. 7,000-8,000 కోట్ల LAS పోర్ట్‌ఫోలియో వాటాదారుల స్థాయిలో తీసుకుంది. ఇప్పుడు ఈ LAS ఎక్స్‌పోజర్‌ను తక్షణమే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 30-45 రోజుల్లో, అదానీ గ్రూప్ తన LASని సున్నాకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రుణాల గడువు తేదీ ఈ సంవత్సరం మే నుండి జనవరి 2024 వరకు ఉంటుంది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లు, ప్రమోటర్ ఈక్విటీ ఫండింగ్‌లతో సహా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సంస్థ ఆలోచిస్తుంది. మరోవైపు, గ్రూప్ సెక్యూర్డ్ రుణాలను బ్యాంకులు రీకాల్ చేసే ప్రమాదం ఉంది. అదానీ గ్రూప్ కంపెనీలకు భద్రత లేని రుణాలు మొత్తం రూ. 11,574 కోట్లు.