Gautam Adani: ఆసియా రిచ్ లిస్ట్‌లో అదానీ టాప్.. అంబానీ స్థానం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఈ క్రమంలో ముకేష్ అంబానీని అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల సూచిక విడుదల చేసిన తాజా జాబితాలో ఈ మార్పు నమోదైంది. తాజా గణాంకాల ప్రకారం గౌతమ్ అదానీ నికర సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 19వ స్థానంలో నిలిచారు. మరోవైపు 90.8 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ 20వ స్థానానికి పడిపోయారు. గురువారం స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లు భారీగా లాభపడటంతో అదానీ సంపద ఒక్కరోజే సుమారు 3.56 బిలియన్ డాలర్లు పెరిగింది.
వివరాలు
అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
శుక్రవారం కూడా అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్ షేర్లు 3 శాతం వరకు లాభాలతో ట్రేడయ్యాయి. 2026లో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అస్థిరతల కారణంగా బిలియనీర్ల ర్యాంకింగ్స్ వేగంగా మారుతున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత లారీ పేజీ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇతర భారతీయ కుబేరుల విషయానికి వస్తే, లక్ష్మీ మిట్టల్ 62వ స్థానంలో, శివ నాడార్ 70వ స్థానంలో, షాపూర్ మిస్త్రీ 71వ స్థానంలో, సావిత్రి జిందాల్ 73వ స్థానంలో నిలిచారు.