
UPI: యూపీఐ లావాదేవీలపై అదనపు ఫీజులు.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు విధించే ప్రణాళికలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టంచేసింది. యూపీఐ ప్లాట్‌ఫాంల ద్వారా జరిగే లావాదేవీలకు వినియోగదారులపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని, ఇది పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఛార్జీలపై వచ్చిన సందేహాలకు ముగింపు డిజిటల్ చెల్లింపులకు అదనపు ఛార్జీలు విధిస్తారన్న వార్తల నేపథ్యంలో గవర్నర్ ఈ వివరణ ఇచ్చారు. యూపీఐపై ఎలాంటి ఫీజు ఆలోచనలో లేదని ఆయన స్పష్టం చేయడంతో వినియోగదారులకు నిశ్చింత కలిగింది.
Details
ప్రస్తుత విధానం కొనసాగింపు
ద్రవ్య విధాన సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, యూపీఐ పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుందని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం-ఆర్‌బీఐ కలిసి యూపీఐని 'జీరో కాస్ట్' ప్లాట్‌ఫారంగా కొనసాగించాలని సంకల్పించాయని తెలిపారు. భారత్ స్థానం మరింత బలపడుతోంది యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డులు సృష్టిస్తున్న సమయంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్స్ మార్కెట్‌గా భారత్ స్థానం మరింత దృఢమవుతోందని గవర్నర్ పేర్కొన్నారు.