LOADING...
Adobe: AI మార్కెటింగ్‌లో అడోబ్ నెక్ట్స్ లెవెల్: సెమ్‌రష్ SEO టూల్స్ ఇంటిగ్రేషన్ ప్లాన్
AI మార్కెటింగ్‌లో అడోబ్ నెక్ట్స్ లెవెల్: సెమ్‌రష్ SEO టూల్స్ ఇంటిగ్రేషన్ ప్లాన్

Adobe: AI మార్కెటింగ్‌లో అడోబ్ నెక్ట్స్ లెవెల్: సెమ్‌రష్ SEO టూల్స్ ఇంటిగ్రేషన్ ప్లాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అడోబ్ డిజిటల్ మార్కెటింగ్ సూట్ బలపర్చే దిశగా కీలక అడుగు వేసింది. సెమ్‌రష్‌ను కొనుగోలు చేయడం ద్వారా, ఇప్పటికే ఉన్న తమ మార్కెటింగ్ టూల్స్‌కు మరింత శక్తి జోడించాలని కంపెనీ చూస్తోంది. వ్యాపారాలు తమ డిజిటల్ క్యాంపెయిన్లు నిర్వహించేందుకు, వెబ్ ట్రాఫిక్‌ను విశ్లేషించేందుకు వీటితో మంచి సహాయం అందుతుంది. ఇదంతా అడోబ్ తీసుకున్నవ్యూహంలో భాగమే. అసలు లక్ష్యం—తమ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో AIని మరింతగా చేరుస్తూ, బ్రాండ్లు కృత్రిమ మేధస్సు సహాయంతో ప్రకటనలు సులభంగా రూపొందించుకునేలా చేయడమే.

వివరాలు 

ర్యాంక్ అవ్వడానికి ఆప్టిమైజ్

సెమ్‌రష్‌ బలమైన SEO సామర్థ్యాలను కూడా అడోబ్ తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురానుంది. దీంతో బ్రాండ్లు AI రూపొందించే సర్చ్ రిజల్ట్స్‌ లేదా రిస్పాన్స్‌లలో స్పష్టంగా కనిపించే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం చాలా వ్యాపారాలు తమ కంటెంట్‌ను, వెబ్ పేజీలను AI ప్లాట్‌ఫామ్లలో బాగా ర్యాంక్ అవ్వడానికి ఆప్టిమైజ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ కొనుగోలు అదే ధోరణిని మరింత వేగవంతం చేస్తుందనడంలో సందేహం లేదు.

వివరాలు 

"జెనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్"సెమ్‌రష్ ముందంజ

"జెనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్" అనే కొత్త రంగంలో సెమ్‌రష్ ముందంజలో ఉంది. చాట్‌జీపీటీ, క్లాడ్, కోపైలట్, గ్రాక్, పర్ప్లెక్సిటీ లాంటి AI ఇంజిన్ల కోసం వెబ్‌సైట్లు ఎలా కనిపించాలి, ఎలా ర్యాంక్ అవ్వాలి అనేదాన్ని మెరుగుపరచడానికే ఈ కొత్త విధానం. సెమ్‌రష్ ఇటీవలే సంప్రదాయ SEO టెక్నిక్స్‌తో పాటు,ఈ కొత్త AI ఆధారిత పద్ధతులను ఉపయోగించి వెబ్‌సైట్ పనితీరు ట్రాక్ చేసి మెరుగుపరచే టూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఆలోచన, అడోబ్ రూపొందిస్తున్న అప్‌గ్రేడ్ మార్కెటింగ్ సూట్ దిశకు పూర్తిగా సరిపోతుంది.