Open AI: 18 నెలల ఆలస్యానికి ముగింపు..ఉద్యోగుల ఈక్విటీ విరాళాలకు ఓపెన్‌ఏఐ గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు 18 నెలల ఆలస్యం తర్వాత, ఓపెన్‌ఏఐ చివరకు తమ ప్రస్తుత,మాజీ ఉద్యోగులకు ఉన్న షేర్లను దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన ఈమెయిల్ ప్రకారం,అర్హత ఉన్న షేర్‌హోల్డర్లు ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. 2019లో ఉద్యోగులకు ఇచ్చిన భారీ ఈక్విటీ ప్యాకేజీల కారణంగా, ఈ విరాళాలు కోట్ల రూపాయల స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా. ఈ సదుపాయం అమల్లోకి రావడం 18 నెలల పాటు ఆలస్యమవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ముఖ్యంగా, AI రంగంలో ప్రతిభ కోసం పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో, కొత్త నియామకాలకు ఆకర్షణగా చూపించిన ఈ దాతృత్వ ఈక్విటీ విరాళాల ప్రతిపాదన ఇంతకాలం నిలిచిపోవడం ఉద్యోగుల్లో ప్రశ్నలు లేపుతోంది.
వివరాలు
కంపెనీ నిర్మాణంలో మార్పులు
కొత్త పాలసీ కింద ఉద్యోగులు ఎంత విరాళం ఇవ్వాలన్నదాని నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చిన సమయం చాలా తక్కువగా ఉండటంతో, SEC ఆదేశాల ప్రకారం ఇతర లిక్విడేషన్ నిర్ణయాలకు అవసరమైన 20 బిజినెస్ డేస్‌తో పోలిస్తే ఇది ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. అంతేకాక కంపెనీ నిర్మాణంలో మార్పులు, విలువ పెరుగుదల మధ్య ఉద్యోగుల ఈక్విటీపై కంపెనీ నియంత్రణ పెరుగుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. నాన్-డిస్‌పారేజ్‌మెంట్ ఒప్పందాలు ఉల్లంఘిస్తే vested equityను కూడా వెనక్కు తీసుకునే అవకాశం ఉందన్న భయం ఉద్యోగుల్లో పెరిగింది. ఈ ఏడాది ఉద్యోగులు Slack చర్చల్లో, ఆల్‌హ్యాండ్స్ మీటింగ్‌లలో విరాళ అవకాశాల లేమిపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు.
వివరాలు
ఓపెన్‌ఏఐ షేర్ విలువ భారీగా పెరిగింది
ఇదిలా ఉండగా, ఓపెన్‌ఏఐ ఇటీవల కాలిఫోర్నియా, డెలావేర్ అటార్నీ జనరల్స్‌తో దాదాపు ఏడాది పాటు కొనసాగిన రీస్ట్రక్చరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. 2015లో లాభాపేక్షలేని పరిశోధనా సంస్థగా స్థాపించబడిన ఈ కంపెనీ షేర్ విలువ కూడా భారీగా పెరిగింది. గత నెల టెండర్ ఆఫర్‌లో ఒక్క యూనిట్‌ను సుమారు 430 డాలర్లకు విక్రయించిన ఉద్యోగులు, ప్రస్తుతం ఒక్క యూనిట్ విలువ 483 డాలర్ల వరకు పెరగడంతో ఈ మార్పులు మరింత చర్చనీయాంశమయ్యాయి.