LOADING...
Akasa Air: ఇండిగో, ఎయిరిండియా తర్వాత.. ఇంధన సర్‌ఛార్జీ విధించిన ఆకాశ ఎయిర్
ఇండిగో, ఎయిరిండియా తర్వాత.. ఇంధన సర్‌ఛార్జీ విధించిన ఆకాశ ఎయిర్

Akasa Air: ఇండిగో, ఎయిరిండియా తర్వాత.. ఇంధన సర్‌ఛార్జీ విధించిన ఆకాశ ఎయిర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు విమానయాన రంగంపై పడుతోంది. ముఖ్యంగా విమాన ఇంధనమైన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు భారీగా పెరగడంతో దేశంలోని విమానయాన సంస్థలు ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంధన సర్‌ఛార్జీ విధిస్తున్న సంస్థల సరసన తాజాగా ఆకాశ ఎయిర్ కూడా చేరింది. ఆకాశ ఎయిర్ ప్రకటించిన ప్రకారం మార్చి 15 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.199 నుంచి రూ.1,300 వరకు ఇంధన సర్‌ఛార్జీ విధించనుంది. ప్రతి విమాన ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుందని, ప్రయాణ దూరం, వ్యవధిని బట్టి చెల్లించాల్సిన మొత్తం మారుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Details

ఒక్కో టికెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకు అదనపు వసూలు

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయని సంస్థ వెల్లడించింది. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైతే ఇంధన సర్‌ఛార్జీలను పునఃసమీక్షిస్తామని కూడా పేర్కొంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు మార్చి 12 నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే ఇండిగో కూడా మార్చి 14 నుంచి ఒక్కో టికెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకు అదనపు ఇంధన సర్‌ఛార్జీ వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామాలతో విమాన ప్రయాణ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement