
Mutual Funds SIP Investment: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు.. 15ఏళ్లపాటు రూ.11111 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందంటే
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దీనికి అనుగుణంగా సరైన ప్రణాళికను తయారుచేసుకోవడం అవసరం. సరిగ్గా పెట్టుబడులు పెట్టితే పెద్ద మొత్తంలో లాభాలు పొందవచ్చు. అందుకోసం సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఒక మంచి మార్గం. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో లక్ష్యాన్ని సాధించవచ్చు. రిస్క్ ఉన్నప్పటికీ, స్థిరమైన పెట్టుబడుల ద్వారా లాభాలను పొందవచ్చు. మార్కెట్ వృద్ధి, పడిపోవడం వంటి హెచ్చుతగ్గుల సమయంలో కూడా మీరు మీ పెట్టుబడిని నిలబెట్టుకుంటే, మంచి లాభాలు పొందవచ్చు.
వివరాలు
సిప్ పెట్టుబడులలో ఆసక్తి
సిప్ పెట్టుబడులలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కాంపౌండ్ వడ్డీ(సంగతిపద్ధతిలో వడ్డీ)మీ పెట్టుబడులును కాలక్రమేణా చాలా విస్తృతంగా పెంచుతుంది. ఇది పెద్ద సంపదను సృష్టించడంలో మీకు సహాయం చేస్తుంది. ఉదాహరణకి, 15సంవత్సరాల పాటు నెలకు రూ. 11,111 పెట్టుబడి పెట్టినప్పుడు,లేదా 10 సంవత్సరాల పాటు నెలకు రూ. 22,222 పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఎంత లాభం పొందగలరో చూద్దాం. 15 సంవత్సరాలలో రాబడి: 12% వార్షిక వడ్డీ రేటుతో, 15 సంవత్సరాలు పాటు నెలకు రూ. 11,111 పెట్టుబడి పెడితే, సుమారు రూ. 56.06 లక్షల కార్పస్ గట్టి ఉంటుంది. ఇందులో మీరు పెట్టుబడి చేసిన మొత్తం రూ. 19,99,980 మాత్రమే. వడ్డీ ద్వారా రూ. 36.06 లక్షలు లాభంగా వస్తాయి.
వివరాలు
10 సంవత్సరాలలో రాబడి:
10 సంవత్సరాలు పాటు నెలకు రూ. 22,222 పెట్టుబడి పెట్టినప్పుడు, మొత్తం కార్పస్ రూ. 51.63 లక్షలు అవుతుంది. ఇందులో మీరు పెట్టుబడి చేసిన మొత్తం రూ. 26.66 లక్షలు. మీరు ఆర్జించే లాభం రూ. 24,96,399. ఈ విధంగా, సిప్ లో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మీరు పెద్ద లాభాలను పొందవచ్చు. కానీ, సిప్ పెట్టుబడులు మార్కెట్ లాభాలు, నష్టాలతో ముడిపడతాయని మర్చిపోవద్దు.
వివరాలు
ప్లాన్ చేసి పెట్టుబడులు పెట్టండి:
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది పెట్టుబడిదారులలో విస్తృతంగా ఆసక్తి ఉండే పద్ధతిగా మారింది. సరిగా ప్లాన్ చేసి పెట్టుబడులు పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది. మీ బ్యాంక్ ఖాతా సిప్‌తో లింక్ చేసుకుని డిపాజిట్లు చేయడం చాలా సులభం. ఒక నిర్దిష్ట తేదీలో, మీ ఖాతా నుండి మొత్తం సిప్ ఖాతాలో చేరుతుంది. సిప్ ప్రారంభించేముందు, మీరు ఎంచుకునే ఫండ్ యొక్క పనితీరును సమీక్షించి, ఆ తరువాత సిప్ ఎంచుకోవడం మంచిది. ఏదైనా సిప్ ప్రారంభం చేయడానికి మీరు కనీసం రూ. 100 నుండి పెట్టుబడి పెట్టవచ్చు.