LOADING...
Air India: అమెరికా, ఐరోపా విమాన టికెట్ల ధరలు తగ్గించిన ఎయిర్ ఇండియా 
అమెరికా, ఐరోపా విమాన టికెట్ల ధరలు తగ్గించిన ఎయిర్ ఇండియా

Air India: అమెరికా, ఐరోపా విమాన టికెట్ల ధరలు తగ్గించిన ఎయిర్ ఇండియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు గతంలో భారీగా పెరగడంతో విదేశీ విమాన టికెట్లపై విధించిన ఇంధన సర్‌ఛార్జీని టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా తాజాగా తగ్గించింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులకు ముందు ఉన్న స్థాయికి ముడిచమురు ధరలు చేరుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది.

వివరాలు 

కొంత మేర తగ్గనున్న విమానాల టికెట్ ధరలు

ఈ మార్పుతో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) వంటి దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాల టికెట్ ధరలు కొంత మేర తగ్గనున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా మార్గాల్లో ఒక్కో టికెట్‌పై ఇంధన సర్‌ఛార్జీని 280 డాలర్ల నుంచి 200 డాలర్లకు తగ్గించారు. అలాగే ఐరోపా, యూకే మార్గాల్లో ఈ సర్‌ఛార్జీని 205 డాలర్ల నుంచి 125 డాలర్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సవరించిన ధరలు జులై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా మార్గాల్లో టికెట్ల ధరలు తగ్గించిన ఎయిర్ ఇండియా

Advertisement