LOADING...
Air India: ఎయిర్ ఇండియా టికెట్ ధరలు పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం
ఎయిర్ ఇండియా టికెట్ ధరలు పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం

Air India: ఎయిర్ ఇండియా టికెట్ ధరలు పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్చార్జ్ పెంచింది. ప్రపంచవ్యాప్తంగా జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో విమానయాన సంస్థలపై ఖర్చు ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన ధరలు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశీయ విమానాల్లో దూరం ఆధారంగా సర్చార్జ్ వసూలు చేస్తారు. 500 కి.మీ లోపు ప్రయాణాలకు రూ.299, 501-1000 కి.మీకి రూ.399, 1001-1500 కి.మీకి రూ.549, 1501-2000 కి.మీకి రూ.749, 2000 కి.మీ పైగా ప్రయాణాలకు రూ.899 వరకు అదనంగా చెల్లించాలి.

వివరాలు 

కొత్త ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి..

ఈ కొత్త ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వస్తాయి. కనెక్టింగ్ ఫ్లైట్లలో ప్రతి సెగ్మెంట్‌కు వేరుగా సర్చార్జ్ ఉండడంతో మొత్తం ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్గాల్లో కూడా భారీ పెంపు జరిగింది. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దూర ప్రయాణాల్లో ఒక్కో సెగ్మెంట్‌కు రూ.26,000 వరకు సర్చార్జ్ విధిస్తున్నారు. జెట్ ఫ్యూయల్ ధరలు తక్కువ సమయంలోనే దాదాపు రెట్టింపు కావడంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రయాణికులకు టికెట్ ధరలు మరింత భారంగా మారనున్నాయి.

Advertisement