Page Loader
పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G
పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో ఎయిర్ టెల్ 5G

పశ్చిమ బెంగాల్‌లోని 15 కొత్త నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 20, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతి ఎయిర్‌టెల్ పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, దుర్గాపూర్, దిన్హటా, అసన్సోల్, జల్పైగురి, డార్జిలింగ్‌తో సహా మరో 15 నగరాల్లో తన 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో ప్రారంభించింది. ఈ నగరాల్లోని ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ నెట్‌వర్క్‌ను ఆస్వాదించవచ్చని పశ్చిమ బెంగాల్ భారతీ ఎయిర్‌టెల్ CEO అయాన్ సర్కార్ అన్నారు. ఈ సంవత్సరం నాటికి భారతదేశంలోని ప్రధాన పట్టణ నగరాలలో 5G సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియో లాగా కాకుండా, ఎయిర్‌టెల్ 4G నెట్‌వర్క్ భాగాలను ఉపయోగించుకునే నాన్-స్టాండలోన్ 5G టెక్నాలజీను ఉపయోగిస్తుంది. ఎయిర్‌టెల్ 5G సేవల యాక్సెస్ కోసం Airtel థాంక్స్ యాప్‌తో చెక్ చేయచ్చు.

రాష్ట్రం

రాష్ట్రంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ ఉన్న నగరాల సంఖ్య 16

ఎయిర్‌టెల్ 5G Plus ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, ఓల్డ్ మాల్దా, రాయ్‌గంజ్, దుర్గాపూర్, బాలూర్‌ఘాట్, అలీపుర్‌దువార్, దిన్‌హటా, అసన్‌సోల్, బుర్ద్వాన్, కూచ్ బీహార్, మెదినీపూర్, జల్‌పైగురి, డార్జిలింగ్, ఇస్లాంపూర్, ఖరగ్‌పూర్‌లోని ఈ నగరాల్లో అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్ 2022లో సిలిగురిలో ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 16. 4G SIM 5Gకు పనిచేస్తుంది కాబట్టి కొత్త SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ 5G Plusని యాక్టివేట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్ళాలి, మొబైల్ నెట్‌వర్క్‌ని ఎంచుకుని, ఎయిర్‌టెల్ సిమ్‌ని ఎంచుకోవాలి. ప్రాధాన్య నెట్‌వర్క్ ని ఎంచుకుని, 5G నెట్‌వర్క్ ఎంపికపై క్లిక్ చేయాలి.