
Airtel: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ డౌన్.. వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) నెట్‌వర్క్ లోపాలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సంస్థ ట్విటర్ ఖాతాలో అనేక మంది వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలపై ప్రశ్నించగా, ఎయిర్‌టెల్ తమవంతు సమాధానాలు ఇస్తోంది. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్‌లో కూడా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సమస్యలు ప్రత్యేకంగా హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నేటి ఉదయం 10 గంటల తర్వాత నెట్‌వర్క్ సమస్యలు మొదలైనట్లు సమాచారం.
Details
గతంలో కూడా ఇలాంటి సమస్యలే
మధ్యాహ్నం 12.27 గంటల సమయంలో డౌన్‌డిటెక్టర్‌లో 6,905 మంది వినియోగదారులు ఫిర్యాదులు నమోదు చేశారు. గతవారం కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో అహ్మదాబాద్, దిల్లీ, చండీగఢ్, లఖనవూ, కోల్‌కతా, గువహాటి, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు నెట్‌వర్క్ డౌన్‌పై ఫిర్యాదులు చేశారు.