LOADING...
Huge investments: భారత్‌లో ఎయిర్‌ట్రంక్‌ మెగా ప్లాన్‌.. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్‌లో ఎయిర్‌ట్రంక్‌ మెగా ప్లాన్‌.. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

Huge investments: భారత్‌లో ఎయిర్‌ట్రంక్‌ మెగా ప్లాన్‌.. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఎయిర్‌ట్రంక్‌ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. దేశంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రణాళికను సంస్థ రూపొందించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. దేశంలో డిజిటల్‌ మౌలిక వసతుల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. అలాగే క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందంజలో నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని చెప్పారు.

వివరాలు

పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు

వీటి ద్వారా దేశీయంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడతాయని వివరించారు. ఎయిర్‌ట్రంక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్‌ ఖుదాతో జరిగిన సమావేశం అనంతరం ప్రధాని ఈ వివరాలను వెల్లడించారు. ఆసియా-పసిఫిక్‌, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఎయిర్‌ట్రంక్‌ ఇప్పటికే పలు డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. భారత మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకునే క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రాను ఎయిర్‌ట్రంక్‌ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌, ముంబయి, చెన్నై నగరాల్లో కలిపి 600 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Advertisement