పోస్టాఫీసుల్లో కీలక మార్పులు.. సేవింగ్స్ ఖాతాదారులకు ముఖ్యగమనిక
పోస్టాఫీసుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు కలిపి తీసుకునేందుకు పోస్టల్ శాఖ నిర్ణయించింది. బ్యాంకుల్లో మాదిరిగానే పోస్టాఫీస్ లోనూ జాయింట్ ఖాతా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడిగా ఖాతా తెరిచేందుకు ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండగా, తాజాగా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడిగా పొదుపు ఖాతాను తెరిచేందుకు వీలు కల్పించింది. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాల్ కు సంబంధించి పలు మార్పులు జరిగాయి. పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న ప్రతి ఖాతాదారుడికి 3మార్పులను పోస్టల్ శాఖ ప్రవేశపెట్టింది. ఖాతాదారుల సంఖ్య, అకౌంట్ నుంచి నగదు విత్ డ్రాల్, ఖాతాలోని డబ్బుపై వడ్డీ అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ద్వారా మార్పులను ప్రకటించింది.
ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు
పోస్టాఫీసు ఖాతాదారుల సంఖ్య పెంపు : బ్యాంకుల్లో మాదిరిగానే పోస్టాఫీసులోనూ ఉమ్మడి ఖాతా తెరిచే అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్ తెరిచేందుకు ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది.తాజాగా దీన్ని మూడుకు పెంచారు. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాల్ కు నియమాలు : పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ నుంచి నగదును విత్‌డ్రాల్ చేసుకునే విధానంలో మార్పులు జరిగాయి. రూ.50 కంటే ఎక్కువ విత్‌డ్రాల్ చేయాలంటే ఫారం-2 సమర్పించాల్సి ఉంటుంది.కొత్త రూల్ మేరకు ఫారం-2కి బదులు ఫారం-3 నింపి పాస్‌బుక్‌తో పాటు సమర్పించాలి. పోస్టాఫీసు ఖాతాలో డిపాజిట్‌పై వడ్డీ : పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారుడు చనిపోతే, మరణానికి ముందు నెలాఖరు వరకే వడ్డీ చెల్లిస్తారు.తాజాగా ఖాతాదారుడి మరణం తర్వాత ఆ నెల వరకూ వడ్డీ చెల్లించనున్నారు.