LOADING...
Amazon layoffs 2026 : అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. 14 వేల మందిఉద్యోగులపై వేటు!
అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. 14 వేల మందిఉద్యోగులపై వేటు!

Amazon layoffs 2026 : అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. 14 వేల మందిఉద్యోగులపై వేటు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
07:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు మరోసారి చేదు వార్త చెప్పబోతోంది. సంస్థలో పెరిగిపోయిన అంతర్గత వ్యవస్థలను తగ్గించి, పనితీరులో వేగం తీసుకురావాలనే లక్ష్యంతో వచ్చే వారం నుంచే కొత్తగా ఉద్యోగ కోతలు ప్రారంభించే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో చేపట్టిన ప్రక్షాళన చర్యలకు కొనసాగింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

అమెజాన్ లేఆఫ్స్ 2026 - వచ్చే మంగళవారం నుంచే అమలు?

2025 అక్టోబర్‌లో అమెజాన్ సుమారు 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో సంస్థ ప్రకటించిన మొత్తం 30 వేల ఉద్యోగాల కోత లక్ష్యంలో ఇది సగం మాత్రమే. మిగిలిన ఉద్యోగాల తొలగింపును వచ్చే మంగళవారం నుంచే అమలు చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ఈ విడతలో కూడా 14 వేల మందికిపైగా ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఏయే విభాగాలపై ప్రభావం పడే అవకాశం?

తాజా వివరాల ప్రకారం, ఈసారి చేపట్టే లేఆఫ్స్ అమెజాన్‌లోని పలు కీలక విభాగాలను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ) విభాగాలపై ప్రభావం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఉద్యోగ కోతల పరిమాణం ఎంత వరకు ఉంటుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, పరిస్థితులను బట్టి మార్పులు జరిగే అవకాశముందని సమాచారం.

Advertisement

వివరాలు 

ఉద్యోగ కోతలకు కారణం ఏంటి?

సాధారణంగా ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ తాజా లేఆఫ్స్ విషయంలో అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ భిన్నమైన వివరణ ఇచ్చారు. "ఈ ఉద్యోగ కోతలు కేవలం ఆర్థిక సమస్యల వల్ల గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా గానీ చేపట్టడం లేదు. సంస్థలో అవసరానికి మించి మేనేజ్‌మెంట్ స్థాయులు పెరిగిపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. వాటిని తగ్గించి కంపెనీ సంస్కృతిని కాపాడటమే మా ఉద్దేశ్యం," అని ఆయన స్పష్టం చేశారు. గతంలో 2022 చివర్లో, 2023 ప్రారంభంలో అమెజాన్ సుమారు 27 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది సంస్థ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్‌గా నిలిచింది.

Advertisement

వివరాలు 

ఉద్యోగ కోతలకు కారణం ఏంటి?

ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వేర్‌హౌస్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో పనిచేస్తుండగా, తాజా లేఆఫ్స్ మాత్రం కేవలం కార్పొరేట్ (వైట్ కాలర్) ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది. కార్పొరేట్ విభాగంలో ఉన్న సుమారు 3.5 లక్షల మందిలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మునుపటి విడతలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇచ్చిన 90 రోజుల గడువు ముగియకముందే కొత్తగా లేఆఫ్స్ వార్తలు వెలువడటంతో అమెజాన్ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు అంతర్జాతీయ మీడియా ప్రయత్నించినప్పటికీ, అమెజాన్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్య వెలువడలేదు.

Advertisement