Page Loader
Amazon quick commerce: డిసెంబర్ నాటికి భారతదేశంలో అమెజాన్ క్విక్‌ కామర్స్‌ 
డిసెంబర్ నాటికి భారతదేశంలో అమెజాన్ క్విక్‌ కామర్స్‌

Amazon quick commerce: డిసెంబర్ నాటికి భారతదేశంలో అమెజాన్ క్విక్‌ కామర్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

నగరాల్లో క్విక్‌ కామర్స్‌ (Quick Commerce) ఆదరణ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, ఈ రంగంలో పోటీ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం జొమాటోకి చెందిన బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, జెప్టో ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అలాగే, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా తన అడుగులు వేస్తోంది. ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం, అమెజాన్‌ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో క్విక్‌ కామర్స్‌ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

లాంచ్‌ తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం 

అమెజాన్‌ ఈ రంగంలో ప్రవేశించేందుకు చాలా కాలంగా కృషి చేస్తోంది. మొదట 2025లో ఈ సేవలను ప్రారంభించాలని భావించినా, రోజురోజుకు కొత్త ప్లేయర్లు ఈ రంగంలో ప్రవేశించడం ఆ దిశగా తమ కృషిని వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టుకు 'తేజ్‌' అనే కోడ్‌నేమ్‌ను ఉపయోగించి, డార్క్‌ స్టోర్లు, లాజిస్టిక్స్‌, స్టాక్‌ కీపింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాలపై పని చేస్తున్నారు. అమెజాన్‌ వార్షిక సమావేశం 'సంభవ్‌' 9-10 డిసెంబర్‌ తేదీల్లో జరగనున్నది, అక్కడ లాంచ్‌ తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

 'మినిట్స్‌' పేరుతో క్విక్‌ కామర్స్‌ ప్రారంభించిన  ఫ్లిప్‌కార్ట్‌ 

ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకమైన రిక్రూట్‌మెంట్‌ను కూడా అమెజాన్‌ చేపట్టింది. ప్రస్తుతం బ్లింకిట్‌, స్విగ్గీ, జెప్టోతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ కూడా 'మినిట్స్‌' పేరుతో క్విక్‌ కామర్స్‌ సేవలను ప్రారంభించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్రూపు కూడా ఈ రంగంలో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ఎంట్రీ, స్టార్టప్‌ కంపెనీలు మరియు పెద్ద ప్లేయర్ల పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ జోరును చూసి స్థానిక కిరాణా స్టోర్లు తగ్గిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.