Amazon: ఏఐ స్మార్ట్‌ఫోన్‌తో మళ్లీ రంగంలోకి అమెజాన్.. అలెక్సాతో కొత్త గేమ్ ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్వంతంగా ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో అమెజాన్ అభివృద్ధి చేసిన సేవలతో పాటు, ప్రముఖ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సమగ్రంగా అనుసంధానమై ఉంటుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణ ఫోన్‌లా పనిచేయడమే కాకుండా, అదనంగా ఏఐ ఆధారిత సేవలను కూడా అందించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారులు అమెజాన్ యాప్ ద్వారా సులభంగా షాపింగ్ చేయడం, ప్రైమ్ వీడియోలో సినిమాలు, సిరీస్‌లు వీక్షించడం, అమెజాన్ మ్యూజిక్‌లో పాటలు వినడం వంటి సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
ఆహార డెలివరీ వంటి సేవలు
అంతేకాదు ఆహార డెలివరీ వంటి సేవలను కూడా ఈ ఫోన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. వినియోగదారుల రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఒకే డివైస్‌లో అన్ని సేవలను సమీకరించే దిశగా అమెజాన్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండొచ్చు, ఎప్పుడు మార్కెట్లోకి విడుదలవుతుందన్న వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ ప్రణాళికలు అనుకున్న విధంగా ముందుకు సాగకపోతే, ఈ ప్రాజెక్టును మధ్యలోనే నిలిపివేసే అవకాశమూ ఉన్నట్లు సమాచారం.