మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
ఈ వార్తాకథనం ఏంటి
మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.
అమెజాన్ ఉద్యోగులతో సిఈఓ ఆండీ జాస్సీ పంచుకున్న మెమోలో ఈ విషయాన్ని పంచుకున్నారు. అంతర్గత వ్యాపారాలు కస్టమర్‌లు ఎక్కువగా శ్రద్ధ వహించే వాటిపై దృష్టి పెట్టడం వలన కొన్ని నష్టాలకు దారి తీసింది, దాని వలన ఖర్చులు తగ్గించుకునేందుకు మొదట 18,000 మందిని ఇప్పుడు మరొక 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఇది సంస్థ ధీర్ఘకాలిక ప్రయోజనం కోసమని చెప్పారు.
సంస్థ
టెక్ కంపెనీలలో మరిన్ని ఉద్యోగాల కోతలు మళ్ళీ ప్రారంభం
టెక్ కంపెనీలలో మరిన్ని ఉద్యోగాల కోతలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. గత వారం, మెటా సంస్థ కూడా మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో, 18,000 ఉద్యోగ కోతలు ప్రధానంగా అమెజాన్ స్టోర్స్, PXT విభాగాలలో ఉంటాయని కంపెనీ తెలిపింది.
రెండు నెలల క్రితం ప్రకటించిన వాటితో ఈ ఉద్యోగ కోతలను ప్రకటించకపోవడానికి గల కారణంపై, జాస్సీ స్పందిస్తూ కొన్ని టీం విశ్లేషణలు పూర్తి కాలేదు, ఇటువంటి నిర్ణయాలలో తొందరపడకుండా ఉండటం వలన, అందరికీ వీలైనంత త్వరగా సమాచారాన్ని అందించగలం. అయితే ఈ ఉద్యోగ కోతలు ఎక్కువగా ఏ టీమ్స్ లో ఉంటాయనే విషయం గురించి ఖచ్చితంగా ఆయన ప్రకటించలేదు.