LOADING...
Amazon: భారత్‌లో విజయం.. ఇప్పుడు విదేశాల్లో అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ సేవలు
భారత్‌లో విజయం.. ఇప్పుడు విదేశాల్లో అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ సేవలు

Amazon: భారత్‌లో విజయం.. ఇప్పుడు విదేశాల్లో అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ సేవలు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 09, 2026
09:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో రూపుదిద్దుకున్న క్విక్‌ కామర్స్‌ విధానం ఇప్పుడు విదేశీ మార్కెట్లకూ ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో ఈ సేవలు ఎంతగా ప్రాచుర్యం పొందాయో తెలిసిందే. ముఖ్యంగా 10 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ విధానం విదేశాల నుంచి వచ్చిన వారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడీ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, అమెజాన్‌ సంస్థ అమెరికా , యూరప్ దేశాల్లో కూడా ఇలాంటి క్విక్‌ కామర్స్ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో 'అమెజాన్‌ నౌ' పేరుతో ఈ సేవలు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో, అదే నమూనాను విదేశాల్లో అమలు చేయాలని సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే గత ఏడాది భారత్‌తో పాటు యూఏఈలో కూడా అమెజాన్‌ ఈ సేవలను ప్రారంభించింది.

వివరాలు

యూరప్‌లోకి అమెజాన్..

అమెజాన్‌ సమాచారం ప్రకారం, 'అమెజాన్‌ నౌ' ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే వస్తువులను వినియోగదారులకు చేరవేస్తున్నారు. ఈ సేవలకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో సుమారు 360 మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు పనిచేస్తుండగా, వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ సేవల ద్వారా వచ్చే ఆర్డర్లు ప్రతి నెల సుమారు 25 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ విజయాన్ని ఆధారంగా తీసుకుని, అమెరికా, యూరప్ ప్రాంతాల్లో కూడా ఈ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో అమెజాన్‌ ముందుకెళుతోంది.

వివరాలు

మరిన్ని దేశాలకు విస్తరణ..

ఇక నివేదికల ప్రకారం, ఎలాంటి డిస్కౌంట్లు లేకపోయినా సుమారు 70 శాతం మంది వినియోగదారులు క్విక్‌ కామర్స్ సేవలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రాంట్‌ థార్టన్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే, ఇతర ఇ-కామర్స్ విధానాలతో పోలిస్తే ఈ క్విక్‌ కామర్స్ రంగం 11 రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతోందని రెడ్‌సీర్‌ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అమెజాన్‌ తన క్విక్‌ కామర్స్ సేవలను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది.

Advertisement