LOADING...
Karur Vysya Bank: కరూర్ వైశ్యా బ్యాంక్‌కు మరో మైలురాయి.. చెన్నైలో 900వ శాఖ ప్రారంభం
కరూర్ వైశ్యా బ్యాంక్‌కు మరో మైలురాయి.. చెన్నైలో 900వ శాఖ ప్రారంభం

Karur Vysya Bank: కరూర్ వైశ్యా బ్యాంక్‌కు మరో మైలురాయి.. చెన్నైలో 900వ శాఖ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా తన శాఖల విస్తరణలో మరో కీలక మైలురాయిని కరూర్ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ) సాధించింది. చెన్నైలోని తొండియార్‌పేట్‌ ప్రాంతంలో బ్యాంకు 900వ శాఖను ప్రారంభించింది. ఈ శాఖను బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమేశ్‌ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంరక్షణ శాఖ అదనపు కార్యదర్శి ఎస్‌. ఉమతో పాటు కరూర్ వైశ్యా బ్యాంకుకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమేశ్‌ బాబు, 'నమ్మకం అనే పునాదిపై పలు తరాల వినియోగదారులతో బలమైన బంధాన్ని కొనసాగిస్తూ కేవీబీ వృద్ధి చెందుతోంది.

Details

కరూర్ వైశ్యా బ్యాంక్‌ మొత్తం టర్నోవరు రూ.2.11 లక్షల కోట్లు

సాంకేతికతను, ఆధునిక బ్యాంకింగ్‌ పరిష్కారాలను స్వీకరిస్తూనే ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్‌ సేవలు చేరువయ్యేలా మా దృష్టి కొనసాగుతోందన్నారు. ఆర్థిక ఫలితాలపై కూడా ఆయన వివరాలు వెల్లడించారు. 2025 డిసెంబరు 31 నాటికి కరూర్ వైశ్యా బ్యాంక్‌ మొత్తం టర్నోవరు రూ.2.11 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపారు. అలాగే 2025 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంకు రూ.690 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు పేర్కొన్నారు.

Advertisement