Loading...
Anthropic IPO: ఆంత్రోపిక్‌ ఐపీఓపై భారీ అంచనాలు.. పెట్టుబడులు పెట్టిన 300 మంది ఎవరంటే?
ఆంత్రోపిక్‌ ఐపీఓపై భారీ అంచనాలు.. పెట్టుబడులు పెట్టిన 300 మంది ఎవరంటే?

Anthropic IPO: ఆంత్రోపిక్‌ ఐపీఓపై భారీ అంచనాలు.. పెట్టుబడులు పెట్టిన 300 మంది ఎవరంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) రంగంలో దూసుకెళ్తున్న ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్‌ (Anthropic) ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఎన్విడియా చుట్టూ నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థ స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ వారం జరగనున్న ఐపీఓ ద్వారా సంస్థ విలువ 1.33లక్షల కోట్ల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (WSJ)వెల్లడించింది. క్లాడ్‌ (Claude)ఏఐ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన సంస్థగా ఆంథ్రోపిక్‌కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆంథ్రోపిక్‌ విలువ 96,500 కోట్ల డాలర్లుగా ఉంది. పిచ్‌బుక్‌ (PitchBook) గణాంకాలను ఉటంకిస్తూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంస్థలో 300మందికి పైగా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టారు.

వివరాలు 

సిరీస్‌-ఏ, సిరీస్‌-బీ నిధుల సమీకరణ

వీరిలో వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు, ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్లు, ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడి నిధులు ఉన్నాయి.

వరుసగా నిర్వహించిన నిధుల సమీకరణ రౌండ్ల ద్వారా ఆంథ్రోపిక్‌ ఈ స్థాయికి చేరుకుంది.

2021లో ఆంథ్రోపిక్‌ తొలిసారిగా సిరీస్‌-ఏ రౌండ్‌లో 12.4 కోట్ల డాలర్లను సమీకరించింది.

ఆ సమయంలో సంస్థ విలువ 46.1 కోట్ల డాలర్లుగా లెక్కించారు. స్కైప్‌ ఇంజినీర్‌ జాన్‌ టాలిన్‌ ఈ పెట్టుబడులకు నాయకత్వం వహించారు.

అనంతరం 2022లో సిరీస్‌-బీ రౌండ్‌లో 58 కోట్ల డాలర్ల నిధులు సమీకరించింది. అప్పట్లో సంస్థ విలువ 300 కోట్ల డాలర్లుగా ఉంది.

ఎఫ్‌టీఎక్స్‌ (FTX) అప్పటి సీఈఓ సామ్‌ బ్యాంక్‌మన్‌-ఫ్రైడ్‌ ఈ పెట్టుబడులకు నేతృత్వం వహించారు.

వివరాలు 

సిరీస్‌-సీ, డీ, ఈ రౌండ్లలో భారీ పెట్టుబడులు

అయితే ఆయనకు చెందిన షేర్లను ఆ తర్వాత దివాలా ప్రక్రియలో భాగంగా విక్రయించారు.

2023లో స్పార్క్‌ క్యాపిటల్‌ ఆంథ్రోపిక్‌లో పెట్టుబడులకు నాయకత్వం వహించిన తొలి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థగా నిలిచింది.

ఈ రౌండ్‌లో 45 కోట్ల డాలర్ల నిధులు సమకూరాయి. దీంతో సంస్థ విలువ 450 కోట్ల డాలర్లకు చేరింది.

అదే ఏడాది చివర్లో మెన్లో వెంచర్స్‌ నేతృత్వంలో మరో పెట్టుబడుల రౌండ్‌ జరిగింది.

ఇందులో 75 కోట్ల డాలర్లకు పైగా నిధులు సమీకరించగా.. సంస్థ విలువ 1,800 కోట్ల డాలర్లకు పెరిగింది.

2025 ప్రారంభంలో లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ నేతృత్వంలో 350 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఆంథ్రోపిక్‌ విలువ 6,000 కోట్ల డాలర్లను దాటింది.

ADVERTISEMENT

వివరాలు 

సిరీస్‌-ఎఫ్‌, జీ, హెచ్‌ రౌండ్లలో రికార్డు స్థాయి నిధులు

2025 చివర్లో ఐకానిక్‌ (Iconiq) నేతృత్వంలో జరిగిన సిరీస్‌-ఎఫ్‌ రౌండ్‌లో ఆంథ్రోపిక్‌ 1,300కోట్ల డాలర్ల నిధులు సమీకరించింది.

ఈ సమయంలో సంస్థ విలువ 18,300కోట్ల డాలర్లకు చేరింది.

2026 ప్రారంభంలో జీఐసీ (GIC),కోట్యూ మేనేజ్‌మెంట్‌ (Coatue Management) నేతృత్వంలో సిరీస్‌-జీ రౌండ్‌ జరిగింది.

ఇందులో ఏకంగా 3,000కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో సంస్థ విలువ 38,000కోట్ల డాలర్లకు పెరిగింది.

అత్యంత భారీగా మే నెలలో జరిగిన సిరీస్‌-హెచ్‌ రౌండ్‌లో ఆంత్రోపిక్‌ 6,500కోట్ల డాలర్లను సమీకరించింది.

ఈ పెట్టుబడులతో సంస్థ విలువ 96,500 కోట్ల డాలర్లకు చేరింది.

ఆల్టిమీటర్‌ క్యాపిటల్‌, డ్రాగోనీర్‌, గ్రీనోక్స్‌, సీక్వోయా క్యాపిటల్‌ సంస్థలు ఈ రౌండ్‌కు నాయకత్వం వహించాయి. అమెజాన్‌ ఒక్కటే 500 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.

ADVERTISEMENT

వివరాలు 

ఆదాయంలోనూ భారీ వృద్ధి

ఆంథ్రోపిక్‌ ఆదాయం కూడా వేగంగా పెరుగుతోంది. సంస్థ ఐపీఓ దరఖాస్తులో వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరీస్‌-హెచ్‌ నిధుల సమీకరణ సమయంలో వార్షిక ప్రాతిపదికన అంచనా వేసిన ఆదాయం (Run-rate Revenue) 4,700 కోట్ల డాలర్లుగా ఉంది.

అక్టోబర్‌ చివరి నాటికి అది సుమారు 8,100 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ ఐపీఓపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ ఐపీఓ విజయవంతమైతే ప్రపంచ క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా నిలిచే అవకాశం ఉంది.

ADVERTISEMENT