Anthropic: బెంగళూరులో ఆంత్రోపిక్ కొత్త కార్యాలయం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది ఆ సంస్థకు రెండో కార్యాలయం కావడం విశేషం. క్లాడ్ అనే ఆంత్రోపిక్ ఏఐ అసిస్టెంట్‌కు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారడంతో ఈ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం క్లాడ్ వినియోగంలో దాదాపు సగం భాగం భారత్ నుంచే వస్తుండగా, ముఖ్యంగా అప్లికేషన్ డెవలప్‌మెంట్, సిస్టమ్ మోడర్నైజేషన్ వంటి కంప్యూటర్, గణిత సంబంధిత పనుల్లో భారత వినియోగం ఎక్కువగా ఉంది. గత అక్టోబర్ 2025లో విస్తరణ ప్రకటన చేసిన తర్వాత ఈ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రెండింతలు కావడం గమనార్హం.
వివరాలు
విద్య, వ్యవసాయ రంగాల్లో ఆంత్రోపిక్ భాగస్వామ్యాలు
బెంగళూరు కార్యాలయం స్థానిక టాలెంట్‌ను నియమించుకుని, భారత అవసరాలకు తగ్గట్టు క్లాడ్ ఆధారిత పరిష్కారాలను సంస్థలు, స్టార్టప్‌లు అమలు చేసుకునేలా సహకరించనుంది. ఇదే సమయంలో విద్య, ఎంటర్‌ప్రైజ్, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యాలను కూడా ఆంత్రోపిక్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా వేగవంతమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి క్లాడ్ కోడ్‌ను వినియోగిస్తుండగా, కాగ్నిజెంట్ తమ పాత సిస్టమ్‌ల అప్‌గ్రేడ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.5 లక్షల మంది ఉద్యోగులకు దీనిని అమలు చేస్తోంది. ఈ చర్యలతో భారత్‌లో బాధ్యతాయుత ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలన్నదే ఆంత్రోపిక్ లక్ష్యంగా వెల్లడించింది.