 
                                                                                Tim Cook: సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో మాకు ఆల్ టైమ్ రికార్డ్ రెవెన్యూ : టిమ్ కుక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కంపెనీ ఆదాయం చరిత్రలోనే అత్యధిక స్థాయిని తాకిందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరగడంతో భారత్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఆదాయం నమోదు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గురువారం సంస్థ తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన అనంతరం, టిమ్ కుక్ విశ్లేషకులతో మాట్లాడుతూ.. "భారత్, యూఏఈ వంటి వర్ధమాన మార్కెట్లలో కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాం. రాబోయే అత్యంత రద్దీ సీజన్ కోసం మా అత్యుత్తమ ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాం," అని తెలిపారు.
వివరాలు
ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరగడమే కారణమన్న ఆపిల్
అమెరికా, కెనడా, పశ్చిమ యూరప్, జపాన్, కొరియా వంటి అనేక దేశాల్లో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. కంపెనీ వివరాల ప్రకారం, ఈ త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 49 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధి అని తెలిపింది. ఆపిల్ సీఎఫ్‌ఓ కెవాన్ పరేఖ్ మాట్లాడుతూ, "భారత్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ సాధించాం. లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా వంటి పలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం," అని వివరించారు.
వివరాలు
వాటాదారులకు షేరుకు 0.26 డాలర్ల డివిడెండ్ ప్రకటన
2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(సెప్టెంబర్ 27తో ముగిసిన)లో ఆపిల్ మొత్తం 102.5 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం అధికం.ఈ ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ మొత్తం ఆదాయం 416 బిలియన్ డాలర్లకు చేరుకుందని పరేఖ్ తెలిపారు. ఈ వృద్ధికి ప్రధాన కారణంగా కొత్తగా విడుదలైన ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్, ఐఫోన్ ఎయిర్ సిరీస్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3, యాఆ ప్రతి షేరుకు 0.26 డాలర్ల డివిడెండ్ ప్రకటించినట్లు ఆపిల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తెలిపింది. ఈ డివిడెండ్ నవంబర్ 13న వాటాదారులకు అందనుంది.