Apple: ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ కొత్త యాప్.. హోమ్ డెలివరీతో పాటు పలు సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరిస్తూ వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది.
ఇప్పటికే రిటైల్ స్టోర్లను పెంచుకున్న ఈ సంస్థ తాజాగా భారతీయ యూజర్ల కోసం ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది.
ఆపిల్ సేవలు, ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించిందని కంపెనీ వెల్లడించింది.
ఈ యాప్ ఇప్పుడు ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉందని శుక్రవారం ప్రకటించింది.
వివరాలు
లేటెస్ట్ ప్రొడక్ట్‌ల అప్‌డేట్‌లు, రిటైల్ ప్రోగ్రామ్ సమాచారం
భారత్‌లో తన మార్కెట్‌ను విస్తరించేందుకు ఆపిల్ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.
చిన్న పట్టణాల్లోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ యాప్ ఒక కీలకమైన భాగంగా ఉంది.
ఇప్పటికే ఇతర దేశాల్లో ప్రసిద్ధి పొందిన ఈ యాప్ ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చింది.
ఈ ''ఆపిల్ స్టోర్ యాప్'' ద్వారా అనేక సేవలను పొందవచ్చు. ఆపిల్ ట్రేడ్ ఇన్, ఫైనాన్సింగ్ ఆప్షన్ వంటి రిటైల్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ ప్రొడక్ట్‌ల అప్‌డేట్‌లు, రిటైల్ ప్రోగ్రామ్ సమాచారం, హోమ్ డెలివరీ, పికప్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఉత్పత్తుల వినియోగం గురించి సమాచారం తెలుసుకోవడానికి ''Go Further'' ట్యాబ్‌ను ఉపయోగించవచ్చు.
వివరాలు
2017లో ఆపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీ
అదనంగా, మ్యాక్ వినియోగదారులు తమకు కావలసిన శక్తివంతమైన చిప్‌లు, స్టోరేజీ ఆప్షన్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోంది.
''భారత వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం'' అని యాపిల్ రిటైల్ ఆన్‌లైన్ హెడ్ కారెన్ రాస్ముసేన్ అన్నారు.
ఈ కొత్త యాప్‌ను ప్రారంభించడంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
2017లో ఆపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది.
2023 ఏప్రిల్‌లో ముంబయి, దిల్లీలో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించింది.
ఈ స్టోర్లకు వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు బెంగళూరు, పుణె, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయిలో మరిన్ని నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.