LOADING...
Apple Pay: భారత్‌లోకి అడుగుపెట్టనున్న ఆపిల్ పే.. నియంత్రణ అనుమతుల కోసం ప్రయత్నాలు
నియంత్రణ అనుమతుల కోసం ప్రయత్నాలు

Apple Pay: భారత్‌లోకి అడుగుపెట్టనున్న ఆపిల్ పే.. నియంత్రణ అనుమతుల కోసం ప్రయత్నాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్, తన డిజిటల్ చెల్లింపుల సేవ Apple Payను భారత మార్కెట్‌లో ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మాస్టర్‌కార్డ్, వీసా వంటి అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లతో చర్చలు జరుపుతోందని, అలాగే అవసరమైన నియంత్రణ అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు మనీకంట్రోల్‌కు తెలిపాయి. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే తొలి దశలో Apple Pay సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా నియంత్రణ సంస్థల అనుమతులు,వాణిజ్య ఒప్పందాల ఖరారుపై ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం,Apple Pay గేట్‌వే వినియోగానికి సంబంధించి కార్డ్ జారీ సంస్థలతో ఫీజు నిర్మాణంపై కూడా ఆపిల్ చర్చలు జరుపుతోంది.

వివరాలు 

దశలవారీగా ప్రారంభం

ప్రస్తుతం Apple Pay ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఇప్పటికే పనిచేస్తోంది. ఆపిల్ భారత్‌లో Apple Pay సేవలను దశలవారీగా ప్రవేశపెట్టనుంది. తొలి దశలో కార్డ్ ఆధారిత కాంటాక్ట్‌లెస్ చెల్లింపులపై దృష్టి పెట్టనుంది. తరువాతి దశలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో అనుసంధానం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే UPIతో ఇంటిగ్రేషన్ కోసం వేర్వేరు, క్లిష్టమైన నియంత్రణ అనుమతులు అవసరం అవుతాయని పేర్కొన్నాయి. ప్రాథమిక దశలో Apple Pay, UPI కోసం TPAP (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) లైసెన్స్‌కు దరఖాస్తు చేసే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. ఎందుకంటే UPI వ్యవస్థ పూర్తిగా వేరే చెల్లింపు నిర్మాణంతో, ప్రత్యేక నియంత్రణ విధానాలతో పనిచేస్తుంది.

వివరాలు 

శాంసంగ్ తో పోటీ

ఈ విషయాన్ని జనవరి 21న తొలిసారిగా బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. ఈ అంశంపై ఆపిల్ ఇండియా, మాస్టర్‌కార్డ్, వీసాలకు పంపిన ప్రశ్నలకు ఎలాంటి స్పందన రాలేదు. భారత మార్కెట్‌లో ఇప్పటికే ఆపిల్ ప్రత్యర్థి సామ్‌సంగ్ తన డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ Samsung Walletను అందుబాటులో ఉంచింది. 2022లో ప్రారంభమైన ఈ సేవ, చెల్లింపులు, కార్డులు, ఇతర సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఇటీవల UPI ఇంటిగ్రేషన్‌తో Samsung Wallet మరింత వేగం పుంజుకుంది. దీంతో భారత డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లో సామ్‌సంగ్ స్థానం బలపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

శాంసంగ్ తో పోటీ

Apple Payను Apple Payments Services అనే అనుబంధ సంస్థ నిర్వహిస్తోంది. సేవలు ప్రారంభమైన తర్వాత, వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను Apple Walletలో భద్రపరచుకొని, NFC సాంకేతికత ద్వారా PoS మెషీన్లపై ట్యాప్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం భారత బ్యాంకులు జారీ చేసిన కార్డులను Apple Walletలో జోడించే అవకాశం లేదు. భారత్‌లో కార్డులు, డిజిటల్ వాలెట్లు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIలు), UPI వంటి ఎలక్ట్రానిక్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో Apple Pay ప్రవేశం కీలకంగా మారింది.

Advertisement

వివరాలు 

భారత్‌లో పెరుగుతున్న ఆపిల్ ఉనికి

ఈ పరిణామాలు భారత్‌లో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విస్తరణకు కూడా అనుసంధానంగా ఉన్నాయి. 2025లో ఆపిల్ దేశంలోనే అత్యధిక ఐఫోన్ షిప్‌మెంట్లను నమోదు చేసింది. మార్కెట్ షేర్ సుమారు 9-10 శాతానికి చేరి, టాప్ ఫైవ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి కాలంలో భారత్‌లో ఐఫోన్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, Apple Pay వంటి లోకలైజ్డ్ సేవలకు బలమైన పునాది ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. కౌంటర్‌పాయింట్ విశ్లేషకుడు వరుణ్ మిశ్రా మాట్లాడుతూ,"భారత్ ఐఫోన్‌లకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా మారింది. పెరుగుతున్న యూజర్ బేస్‌తో ఆపిల్ తన సర్వీసుల విభాగాన్ని విస్తరించేందుకు అవకాశం ఉంది.ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ అయిన భారత్‌లో Apple Pay సహజమైన అడుగు" అని అన్నారు.

వివరాలు 

భారత్‌లో పెరుగుతున్న ఆపిల్ ఉనికి

UPI విస్తృత వినియోగంతో భారత వినియోగదారులు ఇప్పటికే డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడ్డారని, అందువల్ల Apple Pay యూజర్లను ఆకర్షించడంలో పెద్ద అడ్డంకులు ఉండవని ఆయన చెప్పారు. QR ఆధారిత యాప్‌లైన గూగుల్ పేతో పోటీ పడాలంటే, iOSతో గట్టిగా ఇంటిగ్రేషన్, క్లియర్ ఇంటర్‌ఫేస్, NFC, QR, కార్డుల ద్వారా సులభమైన చెల్లింపులు అందించాల్సి ఉంటుందని తెలిపారు. గోప్యత, భద్రతపై ఆపిల్ పెట్టే ప్రత్యేక దృష్టి కూడా ప్రధాన బలంగా మారుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, Apple Pay భారత్‌లో ప్రవేశించే ముందస్తు సంకేతాల నేపథ్యంలో, 2025 నుంచే కొన్ని భారత ఫిన్‌టెక్ సంస్థలు అంతర్జాతీయ లావాదేవీలకు మద్దతుగా Apple Pay ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించినట్లు సమాచారం.

Advertisement