ఆపిల్ పేకి అమెరికా కోర్టులో షాక్.. డిసెంబర్ 1కి కేసు వాయిదా వేసిన న్యాయమూర్తి
ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ సంస్థ, చిక్కుల్లో పడింది. ఈ మేరకు ఆపిల్ పే మొబైల్ వాలెట్ అవిశ్వాసం ఎదుర్కోంటోంది. ఈ క్రమంలోనే మూడు క్రెడిట్ యూనియన్‌లు యాంటీ ట్రస్ట్ సూట్ ను దాఖలు చేశాయి. మ విధించడం, ఇతర డిజిటల్ వాలెట్లు NFC స్కానింగ్ హార్డ్‌వేర్‌ను ఉపయోగించకుండా కట్టడి చేస్తూ యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొన్నాయి. iOS ట్యాప్ టు పే మార్కెట్‌లో పోటీ లేకపోవడం వినియోగదారులకు నష్టమని, iPhone NFC నియంత్రణతో Apple గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందని కక్షిదారుల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దావాను కొట్టివేయాలన్న Apple అభ్యర్థనను న్యాయమూర్తి వైట్ తిరస్కరిస్తూ డిసెంబర్ 1 నాటికి కేసు వాయిదా వేశారు.