LOADING...
April1 Financial Rule Change:2026 ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. ట్యాక్స్ నుంచి రైల్వే రూల్స్ వరకు పూర్తి వివరాలు
ట్యాక్స్ నుంచి రైల్వే రూల్స్ వరకు పూర్తి వివరాలు

April1 Financial Rule Change:2026 ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. ట్యాక్స్ నుంచి రైల్వే రూల్స్ వరకు పూర్తి వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో రెండు రోజుల్లో 2026-27 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. అయితే ఈసారి మార్పుల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉండటం విశేషం. కొత్త ఆదాయపు పన్ను చట్టం,లేబర్ కోడ్స్‌, బడ్జెట్ నిర్ణయాలు,రైల్వే టికెట్ నిబంధనల సవరణల కారణంగా ఉద్యోగులు,వ్యాపారులు,ట్రేడర్లు,సాధారణ ప్రజలు తప్పనిసరిగా ఈ మార్పులపై అవగాహన కలిగి ఉండాలి. ఇన్‌కం ట్యాక్స్‌ యాక్ట్‌, 2025: కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత 1961చట్టాన్ని స్థానంలోకి తీసుకువచ్చిన ఈ చట్టాన్ని మరింత సరళంగా రూపొందించారు. అయితే పన్నుశ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి పన్ను రేట్లు యథాతథంగానే కొనసాగుతాయి.

వివరాలు 

ట్యాక్స్‌ ఇయర్‌:

ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ (FY), అసెస్‌మెంట్ ఇయర్ (AY) అనే రెండు వేర్వేరు పదాలతో పన్ను వ్యవహారం సాగేది. దీనివల్ల చాలా మంది గందరగోళానికి గురయ్యేవారు. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టుతూ ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని "ట్యాక్స్ ఇయర్"గా పిలవనున్నారు. హెచ్‌ఆర్‌ఏ 50 శాతం: ఇంటి అద్దె భత్యం (HRA)పై 50 శాతం పన్ను మినహాయింపు పొందే నగరాల సంఖ్యను కేంద్రం పెంచింది. ఇప్పటి వరకు నాలుగు నగరాలకే పరిమితమైన ఈ ప్రయోజనం ఇప్పుడు ఎనిమిది నగరాలకు విస్తరించింది. హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలను కొత్తగా చేర్చడం వల్ల మరింత మంది ఉద్యోగులకు లాభం కలగనుంది.

వివరాలు 

హెచ్‌ఆర్‌ఏ 50 శాతం:

హెచ్‌ఆర్‌ఏ మినహాయింపులు పొందాలంటే కొన్ని కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తున్నాయి. అద్దెదారు,ఇంటి యజమాని మధ్య ఒప్పంద వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే యజమాని పాన్ వివరాలు కూడా సమర్పించాలి. ఈ నిబంధనలు పాత పన్ను విధానం ఎంచుకున్నవారికే వర్తిస్తాయి. టేక్‌ హోమ్‌ తగ్గనుందా?: కొత్త లేబర్ కోడ్ ప్రకారం ఉద్యోగుల జీతాల నిర్మాణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. మొత్తం సిటిసి (CTC)లో కనీసం 50 శాతం బేసిక్ శాలరీ ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఇది తక్కువగా ఉండటంతో, ఈ మార్పు అమల్లోకి వస్తే పీఎఫ్‌, గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్స్ పెరుగుతాయి. దీంతో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌పై STT పెంపు:

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(F&O)ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను పెంచారు. ఫ్యూచర్స్‌పై 0.02శాతం నుంచి 0.05శాతానికి,ఆప్షన్స్‌పై కూడా గణనీయంగా పెంపు చేశారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే ట్రేడర్లకు ఖర్చులు పెరగనున్నాయి. పాన్‌కు దరఖాస్తు నిబంధనలు: పాన్ కార్డు పొందేందుకు కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఇప్పటి వరకు ఆధార్ సరిపోతుండగా,ఇకపై అదనపు పత్రాలు అయిన ఓటర్ ఐడీ,పాస్‌పోర్ట్ లేదా జనన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలపై పాన్ తప్పనిసరి చేశారు. రూ.10 లక్షలు దాటితే: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా,ఉపసంహరించుకున్నా పాన్ ఇవ్వాలి. అలాగే ఆస్తుల కొనుగోలు,అమ్మకాలు వంటి లావాదేవీలు రూ.20లక్షలు దాటితే కూడా పాన్ అవసరం ఉంటుంది.

Advertisement

వివరాలు 

రూ.10 లక్షలు దాటితే:

వాహనాల కొనుగోలు విషయంలో కూడా కొత్త నిబంధనలు వచ్చాయి. ద్విచక్ర వాహనం సహా ఏ వాహనమైనా రూ.5 లక్షలు మించితే కొనుగోలుదారుడు పాన్ సమర్పించాలి. ఇదివరకు ఈ నిబంధన ద్విచక్ర వాహనాలకు వర్తించేది కాదు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులు రూ.1 లక్ష దాటితే పాన్ తప్పనిసరి. అలాగే బీమా పాలసీల విషయంలో కూడా ప్రతి పాలసీకి పాన్ సమర్పించాల్సి ఉంటుంది. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చేశారు. రైలు బయల్దేరే సమయానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ ఉండదు.

వివరాలు 

రైలు టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌:

24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం, 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం కట్ చేస్తారు. 72 గంటల ముందు రద్దు చేస్తే ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితుల్లో మార్పులు చేసింది. కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ విత్‌డ్రా పరిమితిని 50శాతం వరకు తగ్గించింది. ఇక గ్యాస్ ధరల విషయంలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. మార్చి నెలలోనే వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏప్రిల్‌ 1న మళ్లీ ధరలను సవరించే అవకాశం ఉంది. అలాగే విమాన ఇంధన ధరలపై కూడా ప్రభావం ఉండొచ్చు.

Advertisement