
Personal Finals Tips: అప్పులు అధికమవుతున్నాయా.. అయితే ఆర్థిక ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
అప్పులు ఒక మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఊహించడం కష్టం. అప్పుల భారం తట్టుకోలేక కొందరు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు ఆ అప్పులు తీర్చకుండా తప్పించుకోవడానికి తమ చావును నటిస్తుంటారు. ఇలాంటి ఒక విచిత్రమైన, అసాధారణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఒక వ్యక్తి రూ.1.40 కోట్ల అప్పుల నుంచి తప్పించుకోవడానికి తన సొంత మరణాన్ని ఫేక్ చేశాడు! తన కారును కాళిసింధ్ నదిలో తోసేసి, తాను చనిపోయినట్లు నమ్మించాడు. అయితే అతడి మృతదేహం ఎంత వెతికినా దొరకలేదు. చివరికి మహారాష్ట్రలో అతడు పట్టుబడ్డాడు. అప్పుడు.. తాను అప్పులు మాఫీ చేయించుకోవడానికి ఇలా చేశానని, తాను చనిపోయినట్లు నిరూపించడానికి ఈ నాటకం ఆడానని ఒప్పుకున్నాడు.
Details
అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి
1. ఒక పరిమితి వరకు మాత్రమే రుణం తీసుకోండి ఒక పరిమితికి మించి రుణం తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. సాధారణంగా, మీ నెల జీతంలో 50% మించి ఈఎంఐ ఉండేలా లోన్ తీసుకోవడం సరికాదు. ఎందుకంటే.. అది మీపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. 2. రీఫైనాన్సింగ్ ఒక ఆప్షన్ అప్పుల నుంచి బయటపడటానికి మరొక మార్గం రీఫైనాన్సింగ్. అంటే మీ లోన్‌ను భవిష్యత్తులోకి వాయిదా వేసుకోవడం. ఇలా చేయడం వల్ల మీ ఈఎంఐ భారం తగ్గుతుంది. 3. రుణదాతతో మాట్లాడండి కొన్నిసార్లు, మీ ఈఎంఐ చెల్లింపును తాత్కాలికంగా ఆపమని రుణదాతను అభ్యర్థించడం మంచిది. రుణదాత మీ అభ్యర్థనను తిరస్కరించవచ్చు, లేదా అంగీకరించవచ్చు కూడా
Details
4. తక్కువ వడ్డీ రేటు
కొన్ని సందర్భాల్లో, మీరు మీ రుణాన్ని తక్కువ వడ్డీ రేటు వసూలు చేసే మరొక బ్యాంక్ లేదా సంస్థకు మార్చుకోవచ్చు. దీనివల్ల కూడా మీ ఈఎంఐ తగ్గుతుంది. 5. సరైన లోన్ కేటగిరీని ఎంచుకోండి వివిధ రకాల లోన్‌లు, రుణదాతలు వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేస్తారు. ఉదాహరణకు.. పర్సనల్ లోన్‌పై వడ్డీ వ్యాపార లోన్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే, బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. అందువల్ల, తక్కువ ఈఎంఐలు ఉండేలా సరైన లోన్ కేటగిరీని, రుణదాతను ఎంచుకోవడం చాలా ముఖ్యం.