ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్
అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదోడుకల నేపథ్యంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ భారీ నష్టపోయారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఏకంగా 11బిలియన్ డాలర్ల సంపదను అంటే ఏకంగా రూ.90వేల కోట్లను కోల్పోయారు. ప్రముఖ లగ్జరీ వస్తుల తయారీ సంస్థ ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్, సీఈఓగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. అయితే లగ్జరీ వస్తులకు డిమాండ్ తగ్గుందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లలో ఆయా సంస్థల స్టాక్ మార్కెట్ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ క్రమంలో ప్రపంచస్థాయిలో లగ్జరీ వస్తువుల మార్కెట్లో టాప్ ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ షేర్లపై ఆ ప్రభావం మరింత ఎక్కవగా కనిపించింది.
ఇప్పటికీ ఆర్నాల్డ్ నంబర్ వన్
ఐరోపా మార్కెట్లో లగ్జరీ వస్తువులు తయారు చేసే సంస్థల స్టాక్‌ల పతనం కారణంగా ఆర్నాల్ట్ సంపద భారీగా కరిగిపోయింది. ఎల్‌వీఎంహెచ్ షేర్లు 5% పడిపోయాయి. ఒక్క రోజే లగ్జరీ వస్తువులు తయారు చేసే సంస్థలు 30 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. అమెరికా సహా పలు దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో లగ్జరీ వస్తువులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. దీంతో ఎల్‌వీఎంహెచ్ షేర్లు ఒక్కసారిగా లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. అయితే ఆర్నాల్ట్ సంపదో రూ.90వేల కోట్లు ఆవిరైనా, ఇప్పటికీ 192 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆయనే కొనసాగుతున్నారు.