Page Loader
Shantanu Naidu: రతన్‌ టాటాతో అనుబంధం.. శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి
రతన్‌ టాటాతో అనుబంధం.. శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి

Shantanu Naidu: రతన్‌ టాటాతో అనుబంధం.. శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా గ్రూప్‌కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా జీవితంలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి శంతను నాయుడు. రతన్‌ టాటా జీవిత చరమాంకంలో ఆయనకు కేర్‌టేకర్‌గా, జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరించిన శంతను, తాజాగా టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్‌ ఇనిషియేటివ్స్‌కు జనరల్‌ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శంతను తన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో పంచుకుని, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌ ప్లాంట్‌ నుంచి తెల్ల షర్టు, నేవీ బ్లూ ప్యాంట్‌లో తన తండ్రి (రతన్‌ టాటాను ఉద్దేశిస్తూ) నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో తాను ఆయన కోసం ఎదురుచూస్తూ కిటికీలో నుంచి చూసేవాడిని. ఇప్పుడు తాను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయని శంతను తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Details

జనరల్ మేనేజర్ గా బాధ్యతలు

2018 నుండి, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్సులోనే శంతను రతన్‌ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో 80వ యేట ఉన్న రతన్‌ టాటా, ఈ యువకుడికి తనకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రతన్‌ టాటా జనరల్‌ మేనేజర్‌గా, శంతను అత్యంత విశ్వాసపాత్రుడిగా మారారు. గతేడాది అక్టోబరులో రతన్‌ టాటా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శంతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టారు. ''మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలిగిన దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్'' అని శంతను ఆవేదన వ్యక్తం చేశారు.