
ATM withdrawals: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుండి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
మే 1 నుంచి ATM ఇంటర్‌చేంజ్ ఫీజుల పెంపుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది.
నెలలో ఉచిత పరిమితి కంటే ఎక్కువ ATM లావాదేవీలు చేసే వారికి ఇది ప్రభావం చూపనుంది.
ఇకపై ఇతర బ్యాంకుల ATMల నుండి నగదు తీసుకోవడానికి ₹19,బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ₹7 ఛార్జీ విధించనున్నారు.
గత రెండు సంవత్సరాల్లో,ముఖ్యంగా గ్రామీణ,చిన్న పట్టణ ప్రాంతాల్లో ATM నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి.
ద్రవ్యోల్బణ ప్రభావంతో దాదాపు అన్ని వ్యయాలు పెరుగుతున్నాయి.ATMలో నగదు నింపడం ఖరీదైన పనిగా మారింది.
బ్యాంకులు నిబంధనలు పాటించడానికి మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది.
వివరాలు
అదనపు ఖర్చులను సమర్థించేందుకు ఫీజులు
దీనిని అధ్యయనం చేసేందుకు RBI,ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ అదనపు ఖర్చులను సమర్థించేందుకు ఫీజులు పెంచాల్సిందేనని కమిటీ నిర్ణయించింది.
ఈ మార్పు కేవలం పెద్ద నగరాలను మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు,గ్రామాలను కూడా ప్రభావితం చేయనుంది.
వైట్ లేబుల్ ATMలను నిర్వహించే వారు,ATM ఆపరేటర్లు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నారు.
అంటే,నగదు డ్రా చేసే ప్రతి ఒక్కరికీ అధిక ఛార్జీలు విధించబడతాయి.అయితే, ఛార్జీల పెంపు గురించి ఇప్పటివరకు RBI లేదా NPCI అధికారిక ప్రకటన చేయలేదు.
డిజిటల్ లావాదేవీలు,ఆన్‌లైన్ చెల్లింపులు ఎంత పెరిగినా నగదు అవసరం తగ్గలేదు.
వివరాలు
ఖాతాదారుడికి నెలకు 5 ఉచిత ATM లావాదేవీలు
ఇప్పటికీ చాలా మంది నగదు ఆధారిత లావాదేవీలను ఎక్కువగా నమ్ముకుంటున్నారు.
ఇకపై ATMల నుండి నగదు తీసుకోవాలంటే అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక మార్పులను తీసుకురానున్నాయి.
ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం, ప్రతి ఖాతాదారుడికి నెలకు 5 ఉచిత ATM లావాదేవీలు లభిస్తాయి.
ఈ పరిమితి దాటిన తర్వాత నగదు విత్‌డ్రా చేయడానికి అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.
ATM ఇంటర్‌చేంజ్ ఫీజులు త్వరలో పెరగనున్నాయి. ప్రస్తుతం నెలకు 5 ఉచిత లావాదేవీల అనంతరం, ప్రతి అదనపు ట్రాన్సాక్షన్‌కు బ్యాంకులు ₹21 వసూలు చేస్తున్నాయి.
తాజా నివేదిక ప్రకారం, NPCI ఈ ఫీజును ₹22కి పెంచాలని నిర్ణయించింది.
వివరాలు
వినియోగదారులపై మరింత భారం
ఇది వినియోగదారులపై మరింత భారం పెడుతుంది. మీరు ఇతర బ్యాంకుల ATMను ఉపయోగించినప్పుడు మీ బ్యాంక్ చెల్లించే ఫీజునే ఇంటర్‌చేంజ్ ఫీజుగా పరిగణిస్తారు.
ప్రస్తుతం, ఈ ఫీజు నగదు విత్‌డ్రాలకు ₹17, ఇతర లావాదేవీలకు ₹6గా ఉంది.
NPCI ఈ ఫీజును నగదు విత్‌డ్రాలకు ₹19కి, క్యాష్‌లెస్ లావాదేవీలకు ₹7కి పెంచాలని సూచించింది.
బ్యాంకులు ఈ అదనపు వ్యయాన్ని కస్టమర్లపై మోపుతాయి. కాబట్టి ఇకపై ఇతర బ్యాంకుల ATMలు ఉపయోగించినప్పుడు వినియోగదారులు మరింత అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.