Page Loader
మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్
విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 03, 2023
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు. కోట్ చేసిన బొగ్గు ధర (USD400/MT) ఎక్కువ ఉంది. ఇది USD 250/MT కంటే తక్కువగా ఉండాలి, మా ఇతర థర్మల్ పవర్ ప్లాంట్‌లలో దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం ఇంతే చెల్లిస్తున్నామని BPDC చెందిన అధికారి తెలిపారు. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సార్వభౌమ ప్రభుత్వానికి, భారతీయ కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందం అన్నారు.

అదానీ

దిగుమతిని ప్రారంభించే ముందు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సమీక్షించాలని కోరిన బంగ్లాదేశ్

BPDB విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సమీక్షించాలని విద్యుత్ దిగుమతిని ప్రారంభించే ముందు టారిఫ్ నిర్మాణాన్ని సర్దుబాటు చేయాలని అభ్యర్థించింది. అదానీ పవర్ తమ ప్లాంట్ పొరుగు దేశానికి విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి బొగ్గు దిగుమతికి వ్యతిరేకంగా LCలను తెరవడానికి ముందు భారతీయ అధికారులకు BPDB నుండి డిమాండ్ నోట్‌ను సమర్పించాలి. బంగ్లాదేశ్ ప్రస్తుతం తన సొంత ప్లాంట్లలో 22,700మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. భారతదేశం నుండి 1,160MW విద్యుత్‌ను దిగుమతి చేసుకుంటుండగా, 2017 ఒప్పందం ప్రకారం, ఢాకా అదానీ పవర్ లిమిటెడ్ నుండి 25 సంవత్సరాల పాటు 1,600 MW విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. ఈ సంవత్సరం మార్చి నుండి ఇది ప్రారంభం కావలసి ఉంది