తదుపరి వార్తా కథనం
Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ఇప్పట్లో లేనట్టే.. కేంద్రంపై బ్యాంకు ఉద్యోగుల అసంతృప్తి
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 05, 2024
12:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పనిదినాల ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచిన విషయంపై బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితి దృష్ట్యా, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వారు త్వరలో నిరసనలకు దిగాలని నిర్ణయించుకున్నారు.
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజులే పని ఉండేలా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందం జరిగింది.
వివరాలు
40 నిమిషాలు ఎక్కువ పని
ఈ ఒప్పందం ప్రకారం, ప్రతిరోజూ బ్యాంకు ఉద్యోగులు 40 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.
అయితే, ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ నుండి తుది అనుమతి పొందాల్సి ఉంది.
2015 నుంచి బ్యాంకు ఉద్యోగులు ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాయ్ , త్వరలోనే పోరాటం ప్రారంభించాలని పేర్కొన్నారు.