
Bank Holidays: ఫిబ్రవరిలో 11రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏఏ రోజున మూసి ఉంటాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
2024 ఏడాదిలో ఫిబ్రవరి నెలకు గాను బ్యాంకు సెలవుల సంబంధించిన షెడ్యుల్ విడుదలైంది.
ఫిబ్రవరిలో 11రోజల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఏ ఏ తేదీల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయో ఓసారి తెలుసుకుందాం.
4 ఫిబ్రవరి 2024- ఈ రోజు ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం. ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
10 ఫిబ్రవరి 2024- రెండో శనివారం
11 ఫిబ్రవరి 2024-ఆదివారం
14 ఫిబ్రవరి 2024- బసంత్ పంచమి / సరస్వతి పూజ కారణంగా.. త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
15 ఫిబ్రవరి 2024-ఈ రోజున లూయిస్-నాగై-ని కారణంగా మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
18 ఫిబ్రవరి 2024: ఆదివారం
బ్యాంకు
అందుబాటులో ఆన్ లైన్ సేవలు
19 ఫిబ్రవరి 2024: ఛత్రపతి శివాజీ జయంతి కారణంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
20 ఫిబ్రవరి 2024: రాష్ట్ర దినోత్సవం కారణంగా మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు
24 ఫిబ్రవరి 2024: నాలుగో శనివారం
25 ఫిబ్రవరి 2024: ఆదివారం
26 ఫిబ్రవరి 2024: నైకుమ్ కారణంగా ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు
ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా కాకుండా.. ఆయా రాష్ట్రాల వేడుకలను బట్టి ఆర్‌బీఐ ప్రకటించింది.
అలాగే, సెలవులకు సంబంధించిన పూర్తి జాబితాను ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్‌బీఐ పేర్కొంది. ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.