
'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI
ఈ వార్తాకథనం ఏంటి
Paytm FASTag వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు జారీ చేసింది.
'పేటియం ఫాస్టాగ్' వినియోగదారులు ఇతర బ్యాంకుల ఫాస్ట్‌ట్యాగ్‌కి మారాలని సూచించింది.
Paytm ఫాస్టాగ్ వినియోగదారులు టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులను నివారించడానికి, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇతర బ్యాంక్ ఫాస్టాగ్‌కు మారాలని చెప్పింది.
జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు లేదా రెట్టింపు ఫీజులను నివారించడానికి ఇది సహాయపడుతుంది.
గడువు తేదీ తర్వాత కూడా వినియోగదారులు టోల్ చెల్లించడానికి ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చని NHAI చెప్పింది.
పేటీఎం బ్యాంక్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం రెండు రోజుల తర్వాత ముగియనున్న నేపథ్యంలో NHAI ఈ సూచనలు జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాహనదారులు ఇబ్బందులను నివారించేందుకు ఎన్‌హెచ్ఏఐ సూచన
NHAI advises Paytm users to get new FASTag from other banks before March 15. pic.twitter.com/j2Nb40cUv6
— Marketing Maverick (@MarketingMvrick) March 13, 2024