Page Loader
CBRE: ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు: సీబీఆర్‌ఈ నివేదిక 
ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు: సీబీఆర్‌ఈ నివేదిక

CBRE: ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు: సీబీఆర్‌ఈ నివేదిక 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 ప్రముఖ టెక్నాలజీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రాపర్టీ సేవల సంస్థ సీబీఆర్‌ఈ (CBRE) విడుదల చేసిన 'గ్లోబల్‌ టెక్‌ టాలెంటెడ్‌ గైడ్‌బుక్‌ 2025' ప్రకారం, ఈ నగరంలో టెక్నాలజీ రంగ నిపుణుల సంఖ్య 10 లక్షల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ అధ్యయనంలో సీబీఆర్‌ఈ మొత్తం 115 మార్కెట్లను విశ్లేషించింది.

వివరాలు 

టెక్‌ నిపుణులు ఉన్న 12 నగరాలు

ఈ మార్కెట్లను టెక్‌ టాలెంట్‌ అందుబాటు, నాణ్యత, ఖర్చు వంటి అంశాలపై ఆధారపడి మూడు విభాగాలుగా వర్గీకరించారు. వాటిలో: పవర్‌హౌస్‌లు: అత్యధిక పోటీతత్వంతో టెక్‌ నిపుణులు ఉన్న 12 నగరాలు ఎస్టాబ్లిష్డ్‌ మార్కెట్లు: స్థిరమైన నైపుణ్యాలు కలిగి పరిపక్వత సాధించిన 63 నగరాలు ఎమర్జింగ్‌ మార్కెట్లు: అభివృద్ధి చెందుతున్న సామర్థ్యాలున్న 40 వృద్ధిశీల కేంద్రాలు సీబీఆర్‌ఈ నివేదికలో బెంగళూరును అగ్రశ్రేణి టెక్‌ పవర్‌హౌస్‌గా గుర్తించారు. దీనితో పాటు బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్ మెట్రో, పారిస్, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, సీటెల్, షాంఘై, సింగపూర్, టోక్యో, టొరంటో వంటి నగరాలు కూడా టెక్‌ పవర్‌హౌస్‌ల జాబితాలో ఉన్నాయి.

వివరాలు 

బెంగళూరు మొత్తం 140 వర్చువల్‌ క్యాపిటల్ లావాదేవీల నమోదు

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో బెంగళూరు, బీజింగ్, షాంఘై వంటి నగరాలు అతిపెద్ద టెక్నాలజీ మార్కెట్లుగా గుర్తించబడ్డాయి. బెంగళూరులో 10లక్షలకు మించి టెక్‌ నిపుణులు ఉన్న నేపథ్యంలో, ఈ నగరం ప్రపంచ సాంకేతికత అభివృద్ధి, ఆవిష్కరణలలో ప్రధాన హబ్‌గా మారిందని నివేదిక తెలియజేసింది. ఈ సందర్భంగా సీబీఆర్‌ఈ ఇండియా ఛైర్మన్,సీఈఓ అన్షుమాన్‌ మ్యాగజైన్ మాట్లాడుతూ - ''బెంగళూరు గ్లోబల్‌ టెక్‌ పవర్‌హౌస్‌గా ఎదగడం భారతదేశం డిజిటల్‌ ఆవిష్కరణల్లో తీసుకుంటున్న ముందడుగు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్(ఏఐ)ప్రగతి,నైపుణ్యాల లభ్యత వంటి అంశాలను ప్రతిబింబిస్తుంది'' అని వ్యాఖ్యానించారు. 2024లో బెంగళూరు మొత్తం 140 వర్చువల్‌ క్యాపిటల్(VC)లావాదేవీలను నమోదు చేయగా,దాంతో పాటు 3.3బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించింది. ఈ పెట్టుబడుల్లో 34 సంస్థలు ప్రత్యేకంగా ఏఐ రంగానికి చెందినవేనని ఆయన స్పష్టంగా తెలిపారు.