Warren Buffett: వారెన్ బఫెట్ వద్ద భారీ నగదు నిల్వలు: ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్ల విక్రయం
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్‌కి చెందిన బెర్క్‌షైర్ హాథవే సంస్థ, ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన కంపెనీల షేర్లను క్రమంగా విక్రయిస్తుండటంతో, ప్రస్తుతం ఆయన ఖాతాలో సుమారు 325 బిలియన్ డాలర్లు (సుమారు రూ.27.30 లక్షల కోట్లు) నగదు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నగదు నిల్వ, ఆపిల్ వంటి ప్రముఖ కంపెనీలతో సంబంధం కలిగిన షేర్ల విక్రయం కారణంగా పెరుగుతోంది. ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఐఫోన్‌ల తయారీ సంస్థ యాపిల్‌లోని తన షేర్లను అధికంగా విక్రయించింది. గత ఏడాది చివరికి యాపిల్ షేర్లలో 174.3 బిలియన్ డాలర్ల విలువైన వాటాను బెర్క్‌షైర్ కలిగి ఉండగా,ఈ ఏడాది సెప్టెంబరు నాటికి వాటిని 69.9 బిలియన్ డాలర్లకు తగ్గించింది.
మారని బెర్క్‌షైర్ హాథవే ఆదాయం
బెర్క్‌షైర్ హాథవే ఆదాయం కూడా గతేడాది పోలిస్తే పెద్దగా మారలేదు. గత ఏడాది 93.21 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసిన బెర్క్‌షైర్, ఈ ఏడాది 92.995 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది.