Bharat Pe: భారత్‌పే-ఎస్ బ్యాంక్ సంయుక్తంగా 'పే లేటర్' సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ అయిన భారత్‌పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో సోమవారం 'Pay Later with BharatPe' అనే కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. NPCI ఆధారితంగా పనిచేసే ఈ UPI క్రెడిట్ సదుపాయం, చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు తక్షణ రుణ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త సర్వీస్ తో దేశవ్యాప్తంగా క్రెడిట్ వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ ప్రకటన ప్రకారం, 'Pay Later with BharatPe' ద్వారా వినియోగదారులు ఇప్పుడు అన్ని చోట్ల క్రెడిట్ లైన్ ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.
వివరాలు
45 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్
ఏదైనా UPI QR కోడ్ స్కాన్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీచార్జ్‌లు, బిల్ చెల్లింపులు అన్ని ఇవన్నీ భారత్‌పే యాప్‌లో సులభంగా చేయవచ్చని పేర్కొంది. ఈ సేవలో ప్రత్యేకత ఏమిటంటే, ఏ పేపర్‌వర్క్ లేకుండా, ఆలస్యం లేకుండా తక్షణ UPI క్రెడిట్ లభిస్తుంది. వినియోగదారులు రోజువారీ ఖర్చులకు ఈ క్రెడిట్‌ను ఉపయోగించి, నెలాఖరులో మొత్తం చెల్లించవచ్చు లేదా 3 నుంచి 12 నెలల వరకు EMIలుగా చెల్లించే అవకాశం ఉంది. గరిష్టంగా 45 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్ అందించనున్నారు. చెల్లింపుల తర్వాత క్రెడిట్ లిమిట్ మళ్లీ రీఫ్రెష్ అవుతుందని కంపెనీ తెలిపింది. యాప్‌లోనే క్రెడిట్ వినియోగం,మిగిలిన లిమిట్, EMI వివరాలు, చెల్లింపులు అన్నింటినీ ఒకేచోట చూడవచ్చని భారత్‌పే వెల్లడించింది.
వివరాలు
భారత్‌పే UPI యాప్ ద్వారా లావాదేవీలు చేసిన వినియోగదారులకు రివార్డ్స్
దీంతో వినియోగదారులకు భద్రమైన, సులభమైన, పూర్తి స్థాయి క్రెడిట్ అనుభవం అందుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా భారత్‌పే సీఈఓ నలిన్ నేగి మాట్లాడుతూ,"భారతదేశంలో ముఖ్యంగా చిన్న వ్యాపారులు,కొత్తగా క్రెడిట్ తీసుకునే వినియోగదారుల మధ్య రుణాల వినియోగం ఇంకా తక్కువగా ఉంది. 'Pay Later with BharatPe' ద్వారా వ్యాపారులు, వినియోగదారుల ఖర్చు అవసరాలను తీర్చే సులభమైన, విస్తృత స్థాయి క్రెడిట్ పరిష్కారాన్ని అందిస్తున్నాం" అని తెలిపారు. అలాగే,భారత్‌పే UPI యాప్ ద్వారా లావాదేవీలు చేసిన వినియోగదారులకు BharatPe UPI రివార్డ్స్ కూడా లభిస్తాయని కంపెనీ తెలిపింది. ప్రతి లావాదేవీపై జిలియన్ కాయిన్స్ రూపంలో రివార్డులు వస్తాయి. వీటిని వివిధ బ్రాండ్ల వోచర్లు కొనుగోలు చేయడానికి లేదా యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు వినియోగించుకోవచ్చని వివరించింది.
వివరాలు
UPI వ్యవస్థలో YES బ్యాంక్ కీలక పాత్ర
ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ & మర్చంట్ అక్వైరింగ్ విభాగం కంట్రీ హెడ్ అనిల్ సింగ్ మాట్లాడుతూ, "UPI వ్యవస్థలో YES బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌పేతో కలిసి పెద్ద స్థాయిలో UPI క్రెడిట్ సొల్యూషన్లు అందించడం ఆనందంగా ఉంది. మా డిజిటల్ ఆన్‌బోర్డింగ్, అండర్‌రైటింగ్ సామర్థ్యాలను ఉపయోగించి భారత్‌పే నుంచి వచ్చే వినియోగదారులకు సేవలు అందిస్తాం" అని తెలిపారు. కంపెనీ వివరాల ప్రకారం, భారత్‌పే దేశంలోనే NBFC లైసెన్స్ (Trillion Loans), స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో వాటా (Unity SFB), అలాగే ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కలిగి ఉన్న ఏకైక ఫిన్‌టెక్ సంస్థగా కొనసాగుతోంది.