టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రాజీనామా; కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింత
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్( టీసీఎస్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)& చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాజేష్ గోపీనాథన్ తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. 52 ఏళ్ల గోపీనాథన్ 22 ఏళ్లుగా టీసీఎస్‌లో ఉన్నారు. ఆయన ఆరేళ్లు సీఈవోగా ఉన్నారు. టీసీఎస్ కొత్త సీఈఓగా కె కృతివాసన్ నియమితులైనట్లు వెల్లడించింది. మార్చి 16 నుంచి కె కృతివాసన్ సీఈఓగా బాధ్యతలను నిర్వర్తించనున్ననట్లు టీసీఎస్ వెల్లడించింది.
1989 నుంచి టీసీఎస్‌లో పని చేస్తున్న కృతివాసన్
కృతివాసన్ ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) బిజినెస్ గ్రూప్ గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. 1989 నుంచి టీసీఎస్‌లో పని చేస్తున్నారు. అయన 34 సంవత్సరాలకు పైగా అనుభవజ్ఞుడు. టీసీఎస్‌లో సుధీర్ఘకాలంగా పని చేస్తున్న ఆయన, డెలివరీ, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, లార్జ్ ప్రోగ్రామ్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. గోపీనాథన్ ఆధ్వర్యంలో కంపెనీ పనితీరు పటిష్టంగా ఉందని ఐటీ పరిశోధన సంస్థ హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ఫిల్ ఫెర్ష్ట్ అన్నారు. కృతి బీఎఫ్ఎఫ్ వ్యాపారాన్ని నడిపిస్తూ చాలా బలమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారని పేర్కొన్నారు.