రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి
ఇండియన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 11, 2023 నుండి అతను సెలవులో ఉంటారు, కంపెనీలో చివరి తేదీ జూన్ 09, 2023. డైరెక్టర్ల బోర్డు మోహిత్ జోషి అందించిన సేవలకు ప్రశంసలను అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ & హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపారాలకు మోహిత్ జోషి బాధ్యత వహించారు. అదనంగా, Edgeverve Systems Ltd ఛైర్మన్‌గా, Finacle, ఇన్ఫోసిస్ గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌తో ఉన్న సాఫ్ట్‌వేర్ వ్యాపారానికి, సేల్స్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్‌నెస్‌కు, పెద్ద ఒప్పందాలకు కార్యనిర్వాహక బాధ్యతను, అంతర్గత సాంకేతికత అప్లికేషన్ల పోర్ట్‌ఫోలియోకు నాయకత్వం వహించారు.
మోహిత్ జోషి 2000లో ఇన్ఫోసిస్‌లో చేరారు
మోహిత్ 2000లో ఇన్ఫోసిస్‌లో చేరారు, అప్పటి నుండి సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో, మోహిత్ ఇన్ఫోసిస్ మెక్సికో సిఈఓగా నియమితుడయ్యారు. లాటిన్ అమెరికాలో మొదటి అనుబంధ సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. మోహిత్ కు 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్‌లో చేరాలని ఆహ్వానం వచ్చింది. అతను CBI (కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ)కు చెందిన ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్ YPO (యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్) సభ్యుడు.