
Income tax: మధ్యతరగతికి పెద్ద ఊరట.. ఒక్క రూపాయు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఆర్థిక చర్యల ప్రకారం, మధ్యతరగతి వర్గానికి భారీ ఊరట కల్పిస్తూ రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ సవరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) నుంచి వర్తించనుంది. ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పొరపాటుగా రూ.50,000 మాత్రమే పేర్కొనబడింది. తరువాత ట్యాక్సేషన్ చట్టాలు (సవరణ) బిల్లు, 2025 ద్వారా దాన్ని సరిదిద్దుతూ సెక్షన్ 115BAC(1A)(iii) కింద స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75,000 కు పెంచారు. దీని ద్వారా, రీబేట్ వర్తిస్తే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
Details
రీబేట్ వివరాలు
కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వేతన జీవులకు సెక్షన్ 87ఏ కింద రీబేట్ వర్తిస్తుంది. ఈ రీబేట్ వేతన జీవులకు మాత్రమే వర్తిస్తుంది. స్వల్పకాలిక (Short-term), దీర్ఘకాలిక (Long-term) మూలధన లాభాలపై రీబేట్ వర్తించదు. సెక్షన్ 111A, 112 కింద వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ఆదాయంపై ప్రత్యేక పన్ను రేటు వర్తించాల్సి ఉంటుంది. అంటే, మీరు రూ.12.75 లక్షల లోపు ఆదాయం పొందినా, స్వల్పకాలిక మూలధన లాభాలపై రీబేట్ లేదు. పాత పన్ను విధానం పాత పన్ను విధానం(2024-25 మాదిరిగా) ప్రకారం, రూ.5 లక్షల వరకు ఆదాయంపై రీబేట్ వర్తిస్తుంది. ఇందులో స్వల్పకాలిక మూలధన లాభాలు కూడా కలుపుకొని మొత్తం రూ.12,500 రీబేట్ పొందవచ్చు.