
Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ధరలు గగనానికి చేరుతున్నాయి. దీని ప్రభావం పసిడి ప్రియులపై స్పష్టంగా కనిపిస్తుంది, అయితే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనడం చాలా కష్టమవుతుంది. తాజా సమాచారం ప్రకారం, బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. వివరాల ప్రకారం 1 గ్రాము బంగారం ధరలు 24 క్యారెట్లు - ₹12,836 22 క్యారెట్లు - ₹11,766 18 క్యారెట్లు - ₹9,627 10 గ్రాముల బంగారం ధరలు 24 క్యారెట్లు - ₹1,28,360 22 క్యారెట్లు - ₹1,17,660 18 క్యారెట్లు - ₹96,270
Details
సురక్షిత పెట్టుబడులు వైపు వినియోగదారులు
పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ పెరగడం వంటి కారణాల వల్ల బంగారం డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీని ఫలితంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు నమోదవుతున్నాయి.బంగారం తోపాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాలు ధరల్లో తేడాలను కలిగిస్తాయి.అంతర్జాతీయ పరిణామాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి. బంగారం ధరలు మరింత పెరగవచ్చు. గత మంగళవారం ఒక్కరోజే బంగారం ధరలు సుమారు మూడు వేల రూపాయలకు పైగా పెరిగింది.
Details
వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,29,010; ₹1,18,260; ₹97,710 ముంబై: ₹1,28,360; ₹1,17,660; ₹96,270 ఢిల్లీ: ₹1,28,510; ₹1,17,810; ₹96,470 కోల్‌కతా: ₹1,28,360; ₹1,17,660; ₹96,270 బెంగళూరు: ₹1,28,360; ₹1,17,660; ₹96,270 హైదరాబాద్: ₹1,28,360; ₹1,17,660; ₹96,270 కేరళ: ₹1,28,360; ₹1,17,660; ₹96,270 పూణె: ₹1,28,360; ₹1,17,660; ₹96,270 వడోదరా: ₹1,28,410; ₹1,17,710; ₹96,320 అహ్మదాబాద్: ₹1,28,410; ₹1,17,710; ₹96,320